మీనాక్షి నటరాజన్
సాక్షి, హైదరాబాద్/భూదాన్ పోచంపల్లి: రాష్ట్రంలో సోమవారం నుంచి ‘సర్వోదయ పాదయాత్ర’ మొదలు కాబోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మహారాష్ట్రలోని వార్దా వరకు 600 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించ నున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదివారం వెల్లడించారు. శనివారం రోజున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆదివారం నల్లగొండ ఎంపీ ఉత్తమ్ పాల్గొంటారని చెప్పారు.
ధరణి పోర్టల్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న భూసమస్యల పరిష్కారం, 75 ఏళ్ల భూదా నోద్యమ స్ఫూర్తిని ప్రజలకు మరోసారి చాటిచెప్పడమే యాత్ర ఉద్దేశమ న్నారు. పాదయాత్రలో వివిధ రాష్ట్రాల సర్వోదయ మండలికి చెందిన 25 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. యాత్ర కన్వీనర్ పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక అసమాన తలు పోగొట్టడానికి భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చి పేదవారికి భూమి ఇచ్చామన్నారు.
కానీ నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదవారికిచ్చిన భూమిని లాక్కొని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. కాగా, రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ చైర్మన్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో పాదయాత్ర జరగనుంది. రాష్ట్రంలో 26 రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రంలో యాత్ర కొనసాగు తున్న సమ యంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఓ రోజు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment