
ఛండీగడ్: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, రైతుల ర్యాలీ, నిరసనల నేపథ్యంలో ఉద్రిక్తకర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శంభు సరిహద్దు ప్రాంతం రణరంగంగా మారింది. మరోవైపు.. నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతిచెందాడు.
వివరాల ప్రకారం.. రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకరంగా మారుతున్నాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. ఢిల్లీవైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నిరసనల్లో భాగంగా కొందరు వ్యక్తులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో, వారిని తరిమికొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
सिकंदर पूरी दुनिया जीत सकता था और मोदी पूरा देश भेज सकता था अगर उसने पंजाब के साथ पंगा ना लिया होता...!!!#FarmersProtest2#FarmerProtest2024#FarmersProtest
— karaj_lahoria_ (@karajlahoria28) February 17, 2024
MaXiMuM RePoSt 🔃 👈 👇 pic.twitter.com/kftjJy7Jhi
ఇక, శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు.. పంజాబ్, హర్యానా రైతులకు మద్దతు తెలుపుతూ త్రిపురలో రైతులు, సీఐటీయూ వర్గాలు ర్యాలీలు చేపట్టాయి. రైతుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
शंभू बॉर्डर: किसान आन्दोलन में एक किसान की मृत्यु के बाद गमगीन माहौल।
— PRAMOD KUMAR ANURAGI #d.el.ed (@KumarDheerenda) February 17, 2024
गुरुदासपुर के दिवंगत किसान ज्ञान सिंह को किसानों ने श्रद्धांजलि दी।#FarmersProtest #farmerprotests2024 pic.twitter.com/WwOg4rGRUH
देश के प्रधानमंत्री Narendra Modi जी ....
— RAMESH BAMNAVAT MEENA (@RAMESHM81868278) February 17, 2024
आपको किसानों से इतनी नफरत है
तो सीधा तोप से उड़ा दीजिए....
क्योंकि इन अन्नदाताओं का अनाज आप खाते नहीं आपके लिए तो विदेशों से आता है..... #kisanandolan2024 #FarmersProtest #kisanmajdoorektazindabaad pic.twitter.com/eq7CmZi8cN
ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు.
VIDEO | Farmers Protest: Early morning visuals from Haryana-Punjab Shambhu border where farmers have been camping after being stopped by security forces from moving ahead to Delhi.#FarmersProtest
— Press Trust of India (@PTI_News) February 17, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aLd6lvb5Rd
Comments
Please login to add a commentAdd a comment