రైతు కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట.. వైఎస్ జగన్‌ ట్వీట్‌ | YSRCP Protests Support To Farmers Over CBN Govt Schemes Failures | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

రైతు కోసం వైఎస్సార్‌సీపీ పోరుబాట.. వైఎస్ జగన్‌ ట్వీట్‌

దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం : వైఎస్‌ జగన్‌

  • వైఎస్సార్‌సీపీ పోరుబాట సక్సెస్‌.. వైఎస్ జగన్‌ కీలక ట్వీట్‌
  • చంద్రబాబు మోసాలను నిలదీస్తూ, అన్యాయాలను ప్రశ్నిస్తూ రైతన్నలు ఇవాళ రోడ్డెక్కారు. 
    దగా పాలనపై రైతన్నల తొలి పోరాటం విజయవంతం అయ్యింది
  • .రైతులకు తోడుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆయన అభినందనలు
  • ‘ఆరునెలల కాలంలోనే చంద్రబాబుపై ప్రజావ్యతిరేకతకు ఇవ్వాళ్టి కార్యక్రమం అద్దంపట్టింది. 
  • దీన్ని అడ్డుకోవడానికి చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని పార్టీ నాయకులపైన, రైతులపైన హౌస్‌ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం
  • చంద్రబాబూ.. ప్రజలకు మీరు ఇస్తానన్న సూపర్‌ సిక్స్‌ను గుర్తుచేస్తూ అందులో భాగంగా ప్రతిఏటా పెట్టుబడి సహాయం కింద రూ.20వేలు ఎందుకు ఇవ్వడంలేదని రైతన్నలు ప్రశ్నించడం తప్పా? 
  • ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యంచేసి, ఇ-క్రాప్‌ను గాలికి వదిలేసి, దళారీ వ్యవస్థను ప్రోత్సహించి, ధాన్యం కొనుగోళ్లను మధ్యవర్తులకు, మిల్లర్లకు అప్పగించడంవల్ల ఇవాళ ప్రతి బస్తాకు రూ.300-400లు నష్టపోతున్నామని రైతులు నిలదీయడం తప్పా? 
  • తమకు కనీస మద్దతు ధర ఇవ్వమని అడగడం నేరమా? 
     

 

2024-12-13 17:32:33

రైతుకు అండగా వైఎస్సార్‌సీపీ: నాయకులు, కార్యకర్తలు అరెస్ట్‌

విజయవాడలో రైతు పోరుబాట కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వడం కోసం వెళుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేసిన పోలీసులు

2024-12-13 15:25:56

దళారులు రైతులను దోచుకుంటున్నారు: లక్ష్మీపార్వతి

  • తాడేపల్లి..
  • లక్ష్మీపార్వతి కామెంట్స్..
  • ఆరు నెలలు దాటినా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
  • ధాన్యం కొనడం లేదు
  • వైఎస్‌ జగన్ హయాంలో ఆర్బీకేలతో కొనుగోలు చేశారు
  • తడిచిన ధాన్యాన్ని సైతం వైఎస్‌ జగన్ ప్రభుత్వం కొన్నది
  • సకాలంలో మంచి విత్తనాలు అందించారు
  • చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలే మిగిలాయి
  • వ్యవసాయం దండగా అని తన మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు
  • ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు ఒక్క హమీ కూడా అమలు చేయడం లేదు.
  • దళారులు ప్రవేశించి రైతులను దోచుకుంటున్నారు
  • మద్దతు ధర ఇవ్వక పోగా రైతులను దోపిడీ చేస్తున్నారు
  • చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటే రైతులు అల్లాడి పోతుంటారు
  • ఆత్మహత్యలు చంద్రబాబు హయాంలోనే జరుగుతాయి
  • ఈరోజు మా పార్టీ చేస్తున్న రైతు పోరుకు మంచి స్పందన లభించింది
  • ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు ఎన్నో కుట్రలు పన్నారు
  • నాయకులను అరెస్టు చేసి, మీడియా మీద దాడులు చేసి డైవర్షన్ చేస్తున్నారు
  • గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులకు గన్నీ బ్యాగుల దగ్గర్నుంచి రవాణా ఛార్జీల వరకు అన్నీ భరించింది
  • రైతును కళ్లలో పెట్టుకుని వైఎస్‌ జగన్ జాగ్రత్తగా చూసుకున్నారు
  • చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల కళ్లలో నుంచి కన్నీరు కాదు, రక్తం వస్తోంది
  • రైతులకు ఏ చిన్న సపోర్టును కూడా ఈ ప్రభుత్వం అందించటం లేదు
  • దళారులు, మిల్లర్ల దోపిడీ మళ్ళీ మొదలైంది
  • వైఎస్‌ జగన్ హయాంలో ఏ ఒక్క రైతు అయినా కూడా మాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకు వచ్చారా?
  • చంద్రబాబు హయాంలోనే రైతులు ఎందుకు ఆవేదన చెందుతున్నారు?
  • టమాట ధర లేదని రైతులు రోడ్డు మీద పారేసే పరిస్థితి వచ్చింది
  • రైతులందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది
     
2024-12-13 13:50:58

రైతు దారుణంగా మోసపోతున్నాడు..

  • కృష్ణా..
  • రైతుల సమస్యలపై కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జ్‌ డీఆర్వోకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నేతలు
  • కూటమి పాలనపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫైర్..
  • మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కామెంట్స్‌..
  • కృష్ణాజిల్లాలో రైతు దారుణంగా మోసపోతున్నాడు
  • బస్తాకు 300 వందలు చొప్పున ఎకరాకు పదివేలు వస్తోంది
  • కూటమి ప్రభుత్వం రైతులను దళారుల వద్ద తాకట్టుపెట్టింది
  • ఎన్నికల ముందు 20వేలు మద్దతు ధర ఇస్తామన్నారు
  • రైతుకు సమస్య వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
  • అక్రమ కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారు
  • వైఎస్ జగన్‌ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేశారు
  • రైతు వెన్ను విరిచిన ఘనత చంద్రబాబు, పవన్‌ది
  • రైతులకు సేవ చేసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకెళ్లారు
  • అందుకు విభిన్నంగా ఏపీలో పరిపాలన జరుగుతోంది
  • రైతుకు మద్దతు ధర ఇవ్వకపోతే వైఎస్సార్‌సీపీ తరపున పోరాటం ఉధృతం చేస్తాం
  •  
  •  
  • మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కామెంట్స్‌..
  • ఈ ఏడాది ఒక్కరోజు వర్షానికే రైతులు రోడ్డెక్కి చాలా ఇబ్బందులు పడుతున్నారు
  • గతంలో నెలంతా వర్షాలు పడినా రైతులకు ఇబ్బంది లేకుండా చూశాం
  • మేం ప్రభుత్వం మీదకు యుద్ధానికి రావడం లేదు
  • రైతులకు ఇబ్బంది లేకుండా చూడమని కోరుతున్నాం
  • గతేడాది బీపీటీలు లోడ్ చేస్తే 2200 ఇచ్చారు
  • ఈ యేడాది 1500 ఇచ్చేవాడు కూడా లేడు
  • మిల్లర్లతో కుమ్మక్కై కమీషన్ దారుడితో ధాన్యం కొనిపిస్తున్నారు
  • రైతుల పక్షాన ప్రశ్నిస్తుంటే పోలీసులను అడ్డం పెట్టడం సరికాదు
  • మాయమాటలతో మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • ల్యాండ్ టైట్లింగ్‌ యాక్ట్‌తో వైఎస్‌ జగన్‌ భూములు లాక్కుంటాడని తప్పుడు ప్రచారం చేశారు
  • గతంలో చంద్రబాబు 22ఏ భూములకు డాట్ పెడితే వైఎస్‌ జగన్‌ ఆ భూములకు పరిష్కారం చూపారు
  • మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రాగానే డాట్ పెట్టి జీవో-22 తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టారు
  • ఈ ప్రభుత్వంపై నిరంతరం మా పోరాటం కొనసాగుతుంది
  • ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు..
  • భయపడే రోజులు పోయాయి.
  •  
  • పెడన వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ ఉప్పాల రాము కామెంట్స్‌..
  • గతేడాది ఇదే సమయంలో తుపాన్‌ వచ్చి పంట నీట మునిగింది
  • నీట మునిగిన పంటను కూడా వైఎస్‌ జగన్‌ రైతుల నుంచి కొన్నారు
  • ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై రైతుల నడ్డి విరుస్తోంది 
  • రైతులకు అన్ని విధాలా మేం అండగా ఉంటాం

 

  • పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి కామెంట్స్‌..
  • రెండు రోజుల్లో డబ్బులు జమ అయ్యాయని ఐటీడీపీలో ఫేక్ ప్రచారం చేస్తున్నారు
  • ఫేక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫేక్ ప్రచారాలతో సంకలు గుద్దుకుంటున్నారు
  • మంత్రుల వద్ద నుంచి ఎమ్మెల్యేల వరకూ దాచుకో.. దోచుకో.. పంచుకో విధానం అమలు చేస్తున్నారు
  • దళారీ వ్యవస్థను ప్రోత్సహించి రైతులను దోచుకుంటున్నారు
  • మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ఛాలెంజ్
  • నా నియోజకవర్గంలో ఏ గ్రామానికైనా రండి తీసుకెళ్తాను
  • 1725కి రైతు నుంచి ధాన్యం కొన్నట్లు నిరూపిస్తే మంత్రికి దండేసి సన్మానిస్తా
2024-12-13 13:41:37

కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది..

  • మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్‌ రావు కామెంట్స్...
  • కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది
  • రైతు పండించిన పంట కొనే నాధుడే లేడు
  • రైతులను దళారులు పీక్కు తింటున్నారు
  • బస్తాకు 500 రూపాయల తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
     
2024-12-13 13:41:37

కూటమి నేతలు రైతులను నమ్మించి గొంతు కోశారు..

  • ప్రకాశం..
  • ఒంగోలు పార్లమెంట్ ఇంఛార్జ్‌ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్..
  • కూటమి ప్రభుత్వం రైతుల నడ్డి విరిచారు.
  • నమ్మించి గొంతుకోశారు.
  • మా వినతి పత్రం కూడా తీసుకోవడానికి కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్‌కి మనసు రాలేదు.
  • వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులు సుభిక్షంగా ఉన్నారు.
  • మేము వస్తున్నామని అధికారులు ఎక్కడికో వెళ్ళిపోయారు.
  • రైతుల పక్షాన వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు చేస్తాం. 
     
2024-12-13 13:15:10

అబద్దపు హామీలతో బాబు గద్దెనెక్కారు..

  • చిత్తూరు..
  • రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.
  • రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత.
  • మాజీ ఎంపీ రెడ్డప్ప కామెంట్స్..
  • సీఎం చంద్రబాబు అబద్దపు హామీలతో గద్దెనెక్కారు.
  • రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
  • రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు
  • ఇచ్చిన హామీలు కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది.
  • రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది.
2024-12-13 12:54:45

కూటమి నేతలు హామీలు అమలు చేయాలి..

  • చిత్తూరు..
  • రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ నిరసన ర్యాలీ.
  • రైతుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు వినతిపత్రం అందించిన చిత్తూరు జిల్లా నాయకులు.
  • భారీ ఎత్తున నిరసనల్లో పాల్గొన్న పార్టీ శ్రేణులు, నాయకుల
  • ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు జిల్లా నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలు.
  • కూటమి నేతల కామెంట్స్‌..
  • కూటమి ప్రభుత్వం సూపర్ హామీలు అమలు చేయాలి.
  • లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు తెలుపుతుంది.
  • రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
  • పంటనష్టానికి పరిహారం అందించాలి.
2024-12-13 12:38:00

ఉచిత పంటల భీమా పథకాన్ని కొనసాగించాలి: కాకాణి

  • నెల్లూరు..
  • వీఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి కాకాణి.
  • అన్నదాతలకు అండగా ర్యాలీని ప్రారంభించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి..
  • ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావాలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి,
  • రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు.
  • మంత్రి కాకాణి కామెంట్స్..
  • పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌ది.
  • రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా వైఎస్‌ జగన్ ప్రభుత్వమే చెల్లించింది..
  • పెట్టుబడి సాయం పేరుతో చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు..
  • ఎరువులు కూడా టీడీపీ కార్యకర్తలు, వారీ సానుభూతి పరులకు మాత్రమే ఇస్తున్నారు..
  • ఉచిత పంటల భీమా పథకాన్ని కొనసాగించాలి.
  •  
  • రూరల్ ఇంచార్జ్‌ ఆనం విజయ్ కుమార్ రెడ్డి కామెంట్స్‌..
  • రైతులను మోసం చేయడమే తన నైజమని చంద్రబాబు మరోసారి నిరూపించారు..
  • యూరియా, ఎరువుల కోసం ప్రభుత్వం ముందుగానే డబ్బులు కట్టించుకోవడం దారుణం..
  • ప్రభుత్వం వచ్చి ఆరు మాసాలైనా.. ఇంతవరకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు..
  • రైతులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవని చంద్రబాబుకి తెలిసినా..
  • హామీలను అమలు చెయ్యకపోవడం దారుణం..
  • ఉచిత పంటల బీమాను అమలు చేయాలి. 
2024-12-13 12:21:11

కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేకి: అంబటి

  • గుంటూరు ..
  • మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్‌..
  • ప్రభుత్వం కొనాల్సింది పోయి.. మిల్లర్లకి అప్పగించింది.
  • హాయ్ అని మెసేజ్‌ పెడితే స్పందిస్తామని చెప్పిన మంత్రి మనోహర్ నుంచి స్పందనే లేదు.
  • రైతులను ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు మోసం చేశాడు..
  • రైతు రుణమాఫీ అని చేయలేదు.. రైతు భరోసా 13వేలు కాదు 20వేలు ఇస్తామని చెప్పారు..
  • రైతు భరోసా లేదు.. అన్నదాత సుఖీభవ లేదు..
  • రైతులను చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది..
  • రైతులకు మద్దతుగా మేము ఉన్నామని చెబుతున్నాం.
  • కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం
  • వైఎస్‌ జగన్ రైతుల కోసం రివ్యూల మీద రివ్యూలు చేసి న్యాయం చేశాడు..
  • దళారుల చేతిలో పడి ఎంతో కొంతకి అమ్ముకుంటున్నామని రైతులు కన్నీళ్లు పెడుతున్నారు
  • రైతుల సమస్యపై స్పందించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తున్నారు.
  • ప్రేమ్ కుమార్‌ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.
  • జైల్లో పెడితే భయపడేది లేదు..
  • ప్రతీ చోట వైఎస్సార్‌సీపీ నేతలు, అడ్వకేట్లు ఉన్నారు.
  • కలిసి కట్టుగా ఉండి రైతుల కోసం పోరాటం చేద్దాం.
2024-12-13 12:15:02

కలెక్టరేట్ గేట్లు మూసేసిన పోలీసులు..

  • విజయనగరం జిల్లా..
  • రైతులకు కూటమి ప్రభుత్వం మోసం చేసిందని జిల్లా కలెక్టరేట్ ముందు వైఎస్సార్‌సీపీ నేతలు, రైతుల నిరసన.  రైతు నిరసన.
  • కంటోన్మెంట్ పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ.
  • కలెక్టరేట్ గేట్లు మూసేసి అడ్డుకున్న పోలీసులు.
  • కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వడానికి గేట్ వద్ద ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు, నియోజక వర్గాల సమన్వయకర్తలు.
2024-12-13 12:06:43

అవినాష్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..

  • వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌. 
  • కడపలో అవినాష్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌.
  • వేముల ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లకుండా అవినాష్‌ను అడ్డుకున్న పోలీసులు.
  • ఇ‍ప్పటికే తహశీల్దార్‌ కార్యాలయం వద్ద మోహరించిన టీడీపీ నేతలు.  
2024-12-13 11:46:36

రైతుల కోసం జైలుకైనా వెళ్తాం: భూమన

  • తిరుపతి..
  • భూమన కరుణాకర్‌ రెడ్డి కామెంట్స్‌..
  • తిరుపతి కలెక్టరేట్‌లో రైతుల పక్షాన వినతి పత్రాన్ని అందించిన భూమన కరుణాకరరెడ్డి, పార్టీ నేతలు.
  • మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, భూమన అభినయ్ రెడ్డి, పలువురు నేతలు.
  • భూమన కామెంట్స్‌..
  • ప్రతీ ఏటా రైతులకు 20వేల పెట్టుబడి సాయం అందిస్తాను అని చెప్పి ఈరోజు మోసం చేశారు
  • గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఎన్నికలు హామీలు కలగా మారిపోయాయి
  • పెట్టుబడి సాయం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
  • ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాం
  • రైతులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు
  • చంద్రబాబు ఏనాడూ రైతు పక్షపాతి కాదు
  • వ్యవసాయమే దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు
  • అబద్ధపు హామీలు ఇవ్వలేక వైఎస్‌ జగన్‌ అధికారం కోల్పోవచ్చు కానీ..
  • రైతుల పక్షాన ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం
  • ఆరు నెలలు కాలంలో రైతులను ఏవిధంగా మోసం చేసింది ప్రజలందరూ చూస్తున్నారు.
  • రైతుల కోసం పోరాటాలు కొనసాగిస్తాం.
  • అవసరమైతే రైతుల కోసం జైలుకైనా పోతాం. 
2024-12-13 11:42:41

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి: అమర్నాథ్‌

  • విశాఖలో నిరసనలు..
  • జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ..
  • డీఆర్ఓకు వినతి పత్రం సమర్పించిన వైఎస్సార్‌సీపీ నేతలు..
  • మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ కామెంట్స్‌..
  • రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించాము.
  • ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది..
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు
  • రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి..
  • సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం డక్ ఔట్ అయింది.
  • ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏడాదికి 20000 ఇవ్వాలి.
  • రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి.
  • ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
  • 18 ఏళ్ల నిండిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు.
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. 
2024-12-13 11:30:53

విశాఖ కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత..

  • విశాఖ..
  • జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
  • అన్నదాతకు అండగా కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న రైతులు వైఎస్సార్‌సీపీ నేతలు.
  • వచ్చిన వారిని కలెక్టరేట్ లోపలకి వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు.
  • పార్టీ శ్రేణులు, పోలీసులకి మధ్య తోపులాట.
  • తోపులాటలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య చేతికి గాయం.
     
2024-12-13 11:27:39

బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నిరసనలు..

  • అనకాపల్లి..
  • ప్రారంభమైన అన్నదాతకు అండగా కార్యక్రమం..
  • హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మ శ్రీ, అదీప్ రాజ్, వైఎస్సార్‌సీపీ నేతలు.
  • భారీగా తరలి వచ్చిన రైతులు, పార్టీ శ్రేణులు.
2024-12-13 11:24:38

పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ నేతల నిర్బంధం

  • విజయవాడ
  • ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు నిర్బంధం
  • జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావులను నిర్బంధించిన పోలీసులు
  • పార్టీ నేతలు ఆసిఫ్, ఇంటూరి చిన్న, విజిత, చైతన్య రెడ్డి, తదితరులు నిర్బంధం
  • పార్టీ నేతలు ధర్నాకు వెళ్లకుండా నిర్బంధించిన పోలీసులు
2024-12-13 11:24:38

రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసనలు..

  • రైతులకు అండగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు
  • రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద కొనసాగుతున్న నిరసనలు.
  • కొన్ని చోట్ల రైతులు, వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు.
  • పలు చోట్ల ముందుస్తుగానే వైఎస్సార్‌సీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌, అరెస్ట్‌లు. 
2024-12-13 11:15:26

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత..

  • విజయవాడ
  • ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత
  • అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ నిరసనపై పోలీసులు ఉక్కుపాదం
  • పార్టీ నేతలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
  • మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గ, పార్టీ నేతలు ఆసిఫ్, కార్పొరేటర్లు అరెస్ట్
     
2024-12-13 11:05:56

తిరుపతి కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న రైతులు..

  • తిరుపతి జిల్లా..
  • అన్నదాతకు అండగా కూటమి సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • తిరుపతి కలెక్టరేట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు
  • రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు
     
2024-12-13 11:03:31

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ హౌస్ అరెస్ట్..

  • విజయవాడ..
  • రైతు ధర్నాకు వెళ్లకుండా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ హౌస్ అరెస్ట్
  • నిరసనలో పాల్గొనకుండా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు హౌస్ అరెస్ట్
2024-12-13 11:03:31

భూమన నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసన

  • తిరుపతి జిల్లా..
  • అన్నదాతకు అండగా కూటమి సర్కార్‌పై నిరసన గళం
  • నిరసనలకు వేలాదిగా తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు
  • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో తిరుపతి కలెక్టరేట్ ఎదుట నిరసన
  • తిరుపతి కలెక్టరేట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి  వస్తున్న కార్యకర్తలు, రైతులు
  • రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా భారీ ఎత్తున పాల్గొన్న రైతులు
2024-12-13 11:03:31

తిరుపతి కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న రైతులు..

  • తిరుపతి కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్న రైతులు..
  • తిరుపతి జిల్లా..
  • అన్నదాతకు అండగా కూటమి సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు తరలి వచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • తిరుపతి కలెక్టరేట్ వద్దకు జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు
  • రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా భారీ ఎత్తున పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు
2024-12-13 10:53:45

బాబు.. వైఎస్‌ జగన్ పాలనను చూసి నేర్చుకో..

  • నెల్లూరు..
  • ఎద్దుల బండిపై వీఆర్సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.
  • చంద్రశేఖర్‌ రెడ్డి కామెంట్స్‌..
  • వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులు రాజుగా బతికారు.
  • కూటమి ప్రభుత్వంలో అప్పుల పాలవుతున్నారు.
  • సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తాం.
  • పెట్టుబడి సాయం కింద 20,000 వెంటనే విడుదల చేయాలి.
  • రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకి శ్రీకారం చుట్టాం.
  • ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి.
  • చంద్రబాబు అబద్ధపు హామీలను నమ్మి రైతులు తీవ్రంగా మోసపోయారు.
  • వైఎస్‌ జగన్ పాలనను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి.
     
2024-12-13 10:53:45

వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు..

  • విజయవాడ..
  • వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై పోలీసుల ఆంక్షలు
  • రైతులకు అండగా నిరసన తెలపకుండా నేతలు అరెస్ట్‌లు.
  • ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిరసనకు వెళ్లకుండా దారిలోనే దేవినేని అవినాష్‌ను అడ్డుకున్న పోలీసులు
  • అవినాష్‌ను సిటీలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న పోలీసులు
  • మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇంటి చుట్టూ పోలీసుల మోహరింపు.
  • మల్లాది విష్ణు, కార్పొరేటర్లు బయటకు వెళ్లకుండా పోలీసుల ఆంక్షలు
     
2024-12-13 10:22:39

కలెక్టరేట్‌కు బయలుదేరిన కొట్టు సత్యనారాయణ

  • పశ్చిమగోదావరి జిల్లా..
  • తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్‌కు బయల్దేరిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు.
  • మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కామెంట్స్..
  • రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులను ఏ విధంగా మోసం చేసిందో కనబడుతోంది.
  • చేతి కొచ్చిన ధాన్యం అమ్ముకోడానికి సరైన ధర లేక రైతులు నష్టపోయిన పరిస్థితి నెలకొంది.
  • గత ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా సాయం అందించాం.
  • కూటమి పాలనలో ఇప్పటివరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ రాలేదు.
  • గత ప్రభుత్వంలో సిద్ధంగా ఉంచిన సున్న వడ్డీని కూడా వారికివ్వలేదు.
  • దుర్మార్గపు ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.
  • ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం కలిగేలా చేయాలనే ఉద్దేశ్యంతో ధర్నా కార్యక్రమం నిర్వహించబోతున్నాం.
2024-12-13 10:08:08

వైఎస్సార్‌సీపీ ర్యాలీకి తరలి వస్తున్న రైతులు

  • అనంతపురం..
  • అన్నదాతలకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాట
  • రైతు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన చేపట్టిన వైఎస్సార్‌సీపీ
  • రైతు భరోసా 20 వేల ఆర్థిక సాయం ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించిన రైతులు
  • అనంతపురం జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీ
  • రైతు సమస్యలు వెంటనే తీర్చాలని అధికారులకు వినతి పత్రం సమర్పించనున్న నేతలు
  • వైఎస్సార్‌సీపీ ర్యాలీలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్న రైతులు
2024-12-13 09:03:57

బాబు అంటేనే మోసం..

  • రైతులను మోసం చేసిన కూటమి సర్కార్‌
  • సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీని నెరవేర్చని చంద్రబాబు.
  • రెండు సీజన్లు గడుస్తున్నా అందని పెట్టుబడి సాయం రూ.20 వేలు
  • ఉచిత పంటల బీమా రద్దుతో ధీమా లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్న
  • హామీ మేరకు పెట్టుబడి సాయం కింద రూ10,718 కోట్లు చెల్లించాల్సి..
  • బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లే విదిలించిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదు.
  • పంటల బీమా ప్రీమియం బకాయిలను ఎగ్గొట్టి కూటమి.
  • రైతులకు దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారాన్ని అందకుండా చేసిన బాబు.
  • సున్నా వడ్డీ రాయితీ కింద రూ.131.68 కోట్ల  ఊసెత్తడం లేదు.
  • రబీలో కరువు సాయం బకాయిలు రూ.319.59 కోట్లు ఎగ్గొట్టింది.
  • ఖరీఫ్‌ ధాన్యాన్ని కొనే నాధుడు లేక అల్లాడిపోతున్న రైతులు. 
     
2024-12-13 08:47:16

అన్నదాతల నిరసనకు వైఎస్సార్‌సీపీ బాసట

  • చంద్రబాబు సర్కార్‌ మోసాలపై అన్నదాతల నిరసనకు వైఎస్సార్‌సీపీ బాసట
  • నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్‌ కార్యాలయాల వరకు ర్యాలీలు
  • సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు
  • సూపర్‌ సిక్స్‌ హామీలో చెప్పినట్టుగా పెట్టుబడి సాయంగా రైతులకు రూ.20వేలు చొప్పున వెంటనే అందించాలి
  • ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందే
  • దళారీ వ్యవస్థను నిర్మూలించి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
  • ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌
  • గ్రామస్థాయిలో రైతులకు తోడుగా నిలిచిన ఆర్బీకేలు ఇప్పుడు నిర్వీర్యం
  • ‘మద్దతు’ కరువై అన్నదాత విలవిల.. జాడలేని వ్యవసాయ సలహా మండళ్లు
  • ఐదేళ్లలో రైతన్నలకు రూ.1,88,541 కోట్ల మేర లబ్ధి చేకూర్చిన వైఎస్‌ జగన్‌
  • రైతు భరోసా కింద ఏటా రూ.12,500
  • నాలుగేళ్లలో రూ.50వేలను సాయంగా అందిస్తానని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో జగన్‌ హామీ
  • అధికారంలోకి రాగానే ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500
  • ఐదేళ్లలో రూ.67,500 పెట్టుబడి సాయంగా అందించిన వైఎస్‌ జగన్‌.

2024-12-13 08:41:35
Advertisement
 
Advertisement
 
Advertisement