
ఛండిగడ్: ఛండిగడ్ రాజ్ భవన్ ఎదుట ఆప్ నిరసన చేపట్టింది. లఖీమ్‌పూర్ ఖేరీ రైతుల మృతి ఘటనకు ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఆందోళకరంగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు నిరసనకారులపై వాటర్ కెనాన్స్‌ను ప్రయోగించారు.