
శ్రీ సత్యసాయి, సాక్షి: తెలుగుదేశం పార్టీ హిందూపురం నియోజవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. హిందూపురం పోలీసు స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున రైతులు ధర్నాకు దిగారు. టీడీపీ నేతల కబ్జా వ్యవహారంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలంటూ రైతుల నినాదాలు చేశారు.
హిందూపురంలో రూ. 2 కోట్ల విలువైన పాడి రైతుల భవనాన్ని టీడీపీ నేతలు కూల్చివేశారు. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించకపోవటంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: సొసైటీ భవనం నేలమట్టం