నష్ట పరిహారం కోసం మిర్చి రైతుల ధర్నా | Telangana: Red Chilli Farmers Take Protest To Hyderabad | Sakshi
Sakshi News home page

నష్ట పరిహారం కోసం మిర్చి రైతుల ధర్నా

Published Sat, Dec 25 2021 1:35 AM | Last Updated on Sat, Dec 25 2021 1:35 AM

Telangana: Red Chilli Farmers Take Protest To Hyderabad - Sakshi

వ్యవసాయ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు 

ఖమ్మం మయూరి సెంటర్‌: ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు జరిగిన నష్టాన్ని ప్రకృతి విపత్తుగా గుర్తించి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌ వ్యవసాయ కమిషనరేట్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడారు. అనంతరం వ్యవసాయ అడిషనల్‌ కమిషనర్‌ విజయకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement