లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్ ఖేరీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనను ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. లఖీమ్‌పూర్ ఖేరీలో రాజకీయ నేతల ప్రవేశంపై పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. లఖీమ్‌పూర్‌ఖేరీ వెళ్లేందుకు కాంగ్రెస్ నేత ప్రియంక గాంధీ యత్నించారు. దీంతో ఆమె పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌ను హౌస్ అరెస్ట్ అనంతరం ఆయన ఇంటి ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం దేశవ్యాప్తంగా రైతులు సంఘాలు ఆందోళనలకు పిలుపినిచ్చాయి. లఖీమ్‌పూర్ ఖేరీ ఘటనపై రైతులు సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నిన్న కేంద్రమంత్రి కుమారుడి కారు రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. ఆగ్రహంతో వాహనాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారుల దాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్ మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment