
దామరగిద్ద: బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించడం ఏంటని అనుకుంటున్నారా? అవును మీరు చూస్తున్నది నిజమే.. హైదరాబాద్ నుంచి నారాయణపేటకు ఆర్టీసీ బస్సు బయల్దేరగా.. కొడంగల్ సమీపంలో డ్రైవర్ ముందున్న అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది.
డ్రైవర్ తిరుపతయ్యతో పాటు కండెక్టర్ రఘువీర్‌కు గాజుముక్కలు తగిలి చేతివేళ్లకు గాయాలయ్యాయి. మరోవైపు ముసురు.. చల్లని గాలితో బస్సును నడపడం డ్రైవర్‌కు కష్టసాధ్యంగా మారింది. ఈ క్రమంలో కొడంగల్ నుంచి బస్సు డ్రైవర్ హెల్మెట్ సహాయంతో బస్సు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment