
సాక్షి, నెల్లూరు : జిల్లాలో మంగళవారం విచిత్రం చోటుచేసుకుంది. డ్రైవర్ లేకుండా ఆర్టీసీ బస్సు ముందుకెళ్లింది. ఈ ఘటన రాపూరు డిపోలో జరిగింది. నెల్లూరు టూ రాజపేట సర్వీస్ బస్సును డ్రైవర్ సోమవారం రాత్రి డిపోలో పార్క్ చేశాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున 3 గంటటకు దానంతట అదే ఇంజిన్ స్టార్ట్ అయ్యి బస్సు 100 మీటర్లు ముందుకెళ్లింది. అంతేగాక బస్సు స్టాప్ వద్ద కూడా ఆగకుండా రెండు మెట్లు ఎక్కి పోల్‌ను ఢీకొట్టి ఆగింది. అయితే ఇంజిన్ వైరింగ్ టచ్ వల్ల బస్సు స్టార్ట్ అయి ఉండవచ్చని సిబ్బంది భావిస్తున్నారు. కాగా బస్సు ముందుకెళ్లిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.