
సాక్షి, సిటీబ్యూరో: బైకర్లకో లక్కీ చాన్స్. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు మీరు..మీతోపాటు వెనుక కూర్చున వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే..మీకో హ్యాండ్ శానిటైజర్ ఉచితంగా లభించే అవకాశం ఉంది. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు హెల్మెట్ గురించి వినూత్న ప్రచారం చేపట్టారు. బైకులపై వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్‌లు ధరించి కన్పిస్తే..వారిని ఆపి అభినందిస్తూ శానిటైజర్ బాటిల్‌ను అందచేస్తున్నారు. హెల్మెట్ లేనివారికి ఈ–చలాన్ విధిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఇప్పటివరకు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 9,15,182 ఉల్లంఘనల కేసులు నమోదు చేశామని కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment