సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాలు నడిపే చెవిటి, మూగ దివ్యాంగులకు శుభవార్త. వెనుక నుంచి వస్తున్న వాహనాల హారన్ శబ్దం వినిపించక దివ్యాంగులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటివారి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్‌కే రజలిపాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినూత్న హెల్మెట్‌ను తయారు చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ మోగించినప్పుడు.. వెంటనే హెల్మెట్ ముందుభాగంలో దీపం వెలుగుతుంది. అలా వెలగడంతో ఆ కాంతి హెల్మెట్ అద్దంపై కనిపిస్తుంది.దీంతో అప్రమత్తమై వాహనాన్ని మరింత జాగ్రత్తగా నడపవచ్చు. హారన్ నుంచి వచ్చే ధ్వని తరంగాల ఆధారంగా ఈ హెల్మెట్ దీపాలు వెలిగేలా రూపకల్పన చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment