Motorcycle Helmet Dryer And Deodorizer, Uses, Cost And Other Details - Sakshi
Sakshi News home page

Helmet Dryer: ఈ డివైస్‌ హెల్మెట్‌లోని బాక్టీరియాను చంపేస్తుంది, ధరెంతంటే..

Published Mon, Jun 26 2023 10:55 AM | Last Updated on Thu, Aug 10 2023 6:42 PM

Helmet Dryer And Deodorizer Cost And Details - Sakshi

నిత్యం మనకు సంరక్షణగా ఉండే హెల్మెట్‌ ప్రాణాలనే కాదు దుమ్ము, ధూళి నుంచి కూడా కాపాడుతుంది. మరి దుమ్ము, ధూళితో నిండే ఆ హెల్మెట్‌ని శుభ్రం చేసుకోవడం ఎలా? పరిష్కారం ఇదిగో.. ఈ డ్రైయర్‌!

ఇది క్రిములు, వైరస్‌లు, దుర్వాసన కలిగించే బాక్టీరియా, వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు వంటివన్నిటినీ చంపేస్తుంది. 99.99 శాతం శుభ్రపరుస్తుంది. ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్, హాఫ్‌ ఫేస్‌ హెల్మెట్, సైకిల్‌ హెల్మెట్‌ ఇలా అన్నింటికీ ఉపయోగపడుతుంది.

మరోవైపు  ఈ డివైస్‌తో.. సాక్స్, గ్లౌవ్స్, షూ వంటివాటినీ  ఆరబెట్టుకోవచ్చు. అందుకు వీలుగా చిత్రంలో ఉన్న విధంగా అడ్జస్ట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్‌ అన్నీ డివైస్‌కి కుడివైపే ఉంటాయి. సూపర్‌గా ఉంది కదూ!. ఈహెల్మెట్‌ డ్రైయర్‌ ధర కేవలం 53 డాలర్లు(రూ.4356)మాత్రమే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement