
సాయిలు (ఫైల్)
ద్విచక్రవాహనదారులు ప్రయాణంలో హెల్మెట్‌ధరించకపోవడంతో ప్రమాదంలోఆమూల్యమైన ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): ఆర్టీసీబస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధారి మండలం జువ్వాడి సర్పంచ్ కొనింటి సాయిలు మంగళవారం ఎల్లారెడ్డి ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. గాంధారి నుంచి లింగంపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు మండలంలోని నల్లమడుగు సమీపంలోని ముడిగల ప్రాంతంలో బైక్‌ను ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించి బతికేవాడేమో అని స్థానికులు చర్చించుకున్నారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు కృపాకర్, జీవన్ ఉన్నారు. జీవన్ జన్మదినం మంగళవారం కావడం విశేషం. చిన్న కొడుకు జీవన్‌కు కాళ్లు్ల, చేతులు పని చేయవు, దివ్యాంగుడు. సర్పంచ్ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బస్సు డ్రైవర్ మంగళవారం మధ్యాహ్నం లింగంపేట సమీపంలోని రవిగౌడ్ పెట్రోల్ బంకు యజమాని కారును సైతం ఢీకొన్నట్లు లింగంపేట గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి లింగంపేట, గాంధారి పోలీసులు, చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment