
‘నన్ను ధరించు మీకు పునర్జన ఇస్తాను’అని ఫ్లెక్సీలు అమర్చిన ప్రాంతంలోనే హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్నారు.

‘ట్రిపుల్ రైడింగ్‌కు నో చెప్పండి’ అని ప్రచార బోర్డులు ఉన్న చోటే ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నా.. వాహనచోదకులకు ఇవేమీ పట్టడం లేదు

ఫ్లెక్సీలను చూస్తూనే.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు

పోలీసుల ప్రయత్నాలను నీరుగారుస్తున్నారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహనాలు నడుపుతున్న ఈ దృశ్యాలు.. వాహనచోదకులనిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.



హెల్మెట్ ఉండాల్సింది చేతిలో కాదు
