
సాక్షి, చండీగఢ్ : సిక్కు మహిళలు వాహనాలు నడిపేటపుడు హెల్మెట్ల వాడకం నుంచి చండీగఢ్‌లో మినహాయింపు ఇవ్వనున్నారు. సిక్కు మతానికి చెందిన పలువురు పెద్దలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి టూవీలర్ నడిపే సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపునివ్వాలని కోరారు. మరోవైపు అకాలీదళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ కూడా రాజ్‌నాథ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు.
సిక్కు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు .. ఇప్పటికే ఢిల్లీలో సిక్కు మహిళలకు హెల్మెట్ వాడకంపై మినహాయింపు ఉండటంతో అక్కడి రవాణా శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌నే పాటించాలని చండీగఢ్ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసినట్లు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment