Sikh women
-
వారికి హెల్మెట్ నుంచి మినహాయింపు!
సాక్షి, చండీగఢ్ : సిక్కు మహిళలు వాహనాలు నడిపేటపుడు హెల్మెట్ల వాడకం నుంచి చండీగఢ్‌లో మినహాయింపు ఇవ్వనున్నారు. సిక్కు మతానికి చెందిన పలువురు పెద్దలు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి టూవీలర్ నడిపే సిక్కు మహిళలకు హెల్మెట్ల వాడకంపై మినహాయింపునివ్వాలని కోరారు. మరోవైపు అకాలీదళ్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ బాదల్ కూడా రాజ్‌నాథ్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. సిక్కు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు .. ఇప్పటికే ఢిల్లీలో సిక్కు మహిళలకు హెల్మెట్ వాడకంపై మినహాయింపు ఉండటంతో అక్కడి రవాణా శాఖ ఇచ్చిన నోటిఫికేషన్‌నే పాటించాలని చండీగఢ్ యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసినట్లు హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
వారికి హెల్మెట్ అవసరం లేదా?
న్యూఢిల్లీ: హెల్మెట్ ధరించకుండా సిక్కు మహిళలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మోటారు వాహనాల చట్టం నుంచి వారికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని అడిగింది. మహిళలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై చీఫ్ జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. సిక్కు మహిళలకు హెల్మెట్ అవసరం లేదని భావిస్తున్నారా, వీరికి మినహాయింపునిస్తూ సవరణ చేయడం వెనుకున్న కారణమేంటని ఢిల్లీ నగర పాలక సంస్థను న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 12కు వాయిదా వేసింది.