వారికి హెల్మెట్ అవసరం లేదా? | Why are Sikh women exempted from wearing helmet, Delhi High Court | Sakshi
Sakshi News home page

వారికి హెల్మెట్ అవసరం లేదా?

Published Wed, Oct 1 2014 8:07 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

వారికి హెల్మెట్ అవసరం లేదా?

వారికి హెల్మెట్ అవసరం లేదా?

న్యూఢిల్లీ: హెల్మెట్ ధరించకుండా సిక్కు మహిళలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ మోటారు వాహనాల చట్టం నుంచి వారికి ఎందుకు మినహాయింపు ఇచ్చారని అడిగింది. మహిళలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై చీఫ్ జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ ఆర్ఎస్ ఎండ్లాలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది.

సిక్కు మహిళలకు హెల్మెట్ అవసరం లేదని భావిస్తున్నారా, వీరికి మినహాయింపునిస్తూ సవరణ చేయడం వెనుకున్న కారణమేంటని ఢిల్లీ నగర పాలక సంస్థను న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 12కు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement