– ట్రాఫిక్ పోలీసులు ప్రకటన
వేలూరు: వేలూరు జిల్లాలో ప్రమాదాల నివారించేందుకు గాను డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాల్లో వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించి రావాలని బ్యానర్‌లు, పోస్టర్‌లను కరిపించారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు పలు అవగాహన కార్యక్రమాలు చేయడంతో పాటు హెల్మెట్ ధరించి వచ్చే వారిని ప్రొత్సహించే విధంగా పుష్పాలు, చాక్లెట్‌లు, బొమ్మలను అందజేసి స్వాగతం పలుకుతున్నారు.
ఈ నేపథ్యంలో వేలూరు డీఎస్పీ పృథ్వీరాజ్ సౌకాన్ అధ్యక్షతన ట్రాఫిక్ పోలీసులు వేలూరు గ్రీన్ సర్కిల్‌లో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి రావాలని రావాలని బొమ్మలను ఉంచి అవగాహన చేపట్టారు. హెల్మెట్ ధరించి వచ్చే వారికి బొమ్మలు, పెన్‌లను అందజేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపి వచ్చిన వారికి కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రజనీ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ నుంచి తరచూ హెల్మెట్ ధరించి వచ్చే వారిని గుర్తించి వారి వాహన నెంబర్‌లను నమోదు చేసి వారిని లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. గెలుపొందిన వారికి పెద్ద ఎల్‌ఈడీ టీవీని బహుమతిగా అందజే స్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment