
పులివేషం హెల్మెట్ ధరించి బైక్ నడుపుతున్న ఆకాంక్
దొడ్డబళ్లాపురం : హెల్మెట్ ధరించడమంటే నేటి యువత ఎంతో కష్టమయిన పనిగా భావిస్తుంటారు. వెంట్రుకలు రాలిపోతాయని ,హేర్‌స్టైల్ పాడవుతుందని హెల్మెట్ వేసుకోవడానికి చాలా అయిష్టత చూపుతారు. పోలీసులకు ఫైన్ కావాలంటే కడతాం కానీ, హెల్మెట్ పెట్టుకోమని చాలామమంది యువతీ.యువకులు చెబుతుంటారు. ఈ కష్టాన్ని అర్థం చేసుకున్న మంగళూరుకు చెందిన ఒక యువకుడు కొత్తగా ఆలోచించాడు. ఆ యువకుడు సెట్ చేసిన ట్రెండ్ ప్రస్తుతం మంగళూరులో హాట్‌టాఫిక్‌గా మారింది.
హెల్మెట్‌పై పులివేషం పెయింటింగ్ వేయడం ద్వారా హెల్మెట్‌పై ఇష్టం కలిగేలా చేసాడు. అతడి పేరు ఆకాంక్ష్ శెట్టి. హెల్మెట్ కష్టాలు పడ్డవారిలో ఇతడూ ఒకడు. యువతకు హెల్మెట్‌పై మోజు కలిగేలా చేయాలనుకుని కొత్తగా ఆలోచించాడు.విదేశాలలో హ్యావెంజర్స్ హెల్మెట్‌లను ధరించి యువత బైక్‌లు నడపడం టీవీలో చూసాడు. కరావళి ప్రాంతాల్లో పులివేషం ఒక క్రేజ్..పులివేషం వేసుకుని డ్యాన్స్ చేయడమన్నా, చూడడమన్నా ఇక్కడి ప్రజలకు ఎంతో ఇష్టం.ఇదే వీక్‌నెస్ పట్టుకున్న ఆకాంక్ష్ మంగళూరుకు చెందిన ఆర్టిస్ట్ ఉమేశ్ వద్ద తమ ఐడియా గురించి చెప్పి హెల్మెట్‌లపై పులివేష పెయింటింగ్ గీయించి మొదట తానే వేసుకుని తిరిగాడు. తరువాత హెల్మెట్‌లను ఖరీదుచేసి వాటిపై పెయింటింగ్ వేయించాడు. రానురాను ఈ తరహా హెల్మెట్లకు మంగళూరులో డిమాండు ఏర్పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment