
వాషింగ్టన్: మన మెదడులోని ఆలోచనలను కనిపెట్టడం అంత సులువు కాదని అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అది సులువేనని అమెరికాలోని ఓ సంస్థ చెప్తోంది. కెర్నెల్ అనే సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను తయారు చేసింది. దీనిపై చేసిన పరీక్షల ఫలితాలన్నీ ఆశాజనకంగానే వచ్చాయని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇక వీటిని వారం రోజుల్లో పలువురు కస్టమర్లుకు కూడా పంపునుంది. దీని ధరను 50 డాలర్లు (సుమారు రూ. 3,700)గా నిర్ణయించారు.
ఈ హెల్మెట్లలో మెదడును అంచనా వేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు ఉంటాయి. వీటితో రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు శరీరంలోని అవయవాలు స్పందిస్తున్న తీరును అంచనా వేయవచ్చని అంటున్నారు. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదివరకే ఉన్నప్పటికీ అందులో కొన్ని లోపాలు ఉన్న కారణంగా వాటిని అధిగమిస్తూ ఈ పరికరాన్ని కనిపెట్టారు.
ఉదాహరణకు ఇలాంటి పరికరానికి ఇదివరకు అయ్యే ఖర్చు మిలియన్ డాలర్లుగా ఉండేది. పైగా సైజు పరంగా ఒక గది స్థలాన్ని ఆక్రమించేది. ప్రస్తుతం ఈ పరికరం తక్కువ ఖర్చు, పైగా బరువు చూస్తే 2 పౌండ్లు మాత్రమే ఉంటుంది. ‘సమాజంలో అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించడానికి, మా హెల్మెట్ ఉపయోగపడనుందని’ బ్రయాన్ జాన్సన్ చెప్పారు, అతను గత ఐదేళ్ళకు పైగా ఆయన ఈ హెల్మెట్ రూపొందించడానికి పని చేస్తున్నాడు. అదే క్రమంలో ఈ ప్రాజెక్ట్ కోసం 110 మిలియన్ డాలర్లు డబ్బును కూడా ఖర్చు పెట్టాడు.
చదవండి: స్టైలిష్ లుక్‌తో కట్టిపడేస్తున్న 'యమహా'
Comments
Please login to add a commentAdd a comment