అంతర్జాతీయ కాంట్రాక్ట్ మ్యారేజ్ అడ్డాలపై సౌత్ జోన్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. నగరంలోని పాతబస్తీ, ఫలక్‌నుమ, చంద్రాయణగుట్ట, తలాబ్‌కట్టా ప్రాంతాల్లోని ఖాజీల ఇళ్లు, కార్యాలయాలపై పోలీసులు ఏకకాలంలో తనిఖీలు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.