
హైదరాబాద్: పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్‌లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్‌లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో ఉన్నాడని చెప్పారు. 38 మంది బ్రోకర్లను గుర్తించామని, అందులో 15 మంది ఒమన్‌కు చెందినవారని తెలిపారు. కేరళ, కర్ణాటక, ముంబై నుంచి వీసాలు తెప్పించి హైదరాబాద్ మైనర్ బాలికలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.
పట్టుబడిన అరబ్ షేక్‌ల వద్ద అనేక రకాల స్టిరాయిడ్స్, లైంగిక సామర్థ్యాన్ని పెంచే మాత్రలు లభించాయన్నారు. ఒక్కో ఖాజీ 10 మంది మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఒమన్ దేశానికి రాయాబార కార్యాలయం ద్వారా లేఖ రాసి ఇలాంటి వారిని మన దేశానికి రాకుండా చూస్తామన్నారు. పదే పదే ఇలాంటి నేరాలకు పాల్లడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టబడ్డ అబ్దుల్ రఫై ఖాజీ ఇప్పటివరకు 50 వివాహాలు చేశాడని, దుబాయ్‌లో చాలా వరకు అమ్మాయిలను సరఫరా చేసేది ఇతడేనని డీసీపీ తెలిపారు.