contract marriages
-
బాలికలపై వల
లంబాడీ గిరిజన బాలికల జీవితాలతో మోసగాళ్లు చెలగాటమాడుతున్నారు. నిరక్షరాస్యులు, పదో తరగతి లోపు చదివిన మైనర్లే లక్ష్యంగా వల విసురుతున్నారు. వారి బారిన పడి అనేక మంది కష్టాలు అనుభవిస్తుండగా.. మరికొందరు అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు.. ఇంకొందరు కనిపించకుండా పోతున్నారు. నెక్కొండలో శుక్రవారం వెలుగు చూసిన కాంట్రాక్ట్ వివాహాల నేపథ్యంలో గతంలో జరిగిన గిరిజన బాలిక ల అదృశ్యం.. మృతి చెందిన ఘటనలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: జిల్లాలోని నెక్కొండ మండలం గొట్లకొండ తండాలో ఇద్దరు బాలికలు, ఓ వివాహితను పెళ్లి చేసుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన 55 ఏళ్లు పైబడిన ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించిన ఘటన సంచలనం రేపింది. ఆ వ్యక్తులతో వివాహానికి సిద్ధమైన ముగ్గురిలో ఇద్దరు పూర్తిగా నిరక్షరాస్యులు. ఒకరు ఆరో తరగతి వరకు చదువుకుని మధ్యలో ఆపేశారు. ఇందులో ఆరో తరగతి వరకు చదివిన ఒక బాలిక వివాహాన్ని వ్యతిరేకించిం తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం శుక్రవారం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు శనివారం తండాకు చేరుకుని విచారణ చేపట్టారు. గిరిజనులే లక్ష్యంగా.. మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రానైట్, మార్బుల్స్ వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. వీటి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో వయసు పైడిన వారు, స్థానికంగా పెళ్లి సంబంధాలు కుదరని వారు ఇక్కడి గిరిజన యువతులను వివాహం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొంత కాలంగా> ఈ తరహా పద్ధతి చాపకింద నీరులా కొనసాగుతోంది. గిరిజన తండాలు, అందులో పేదరికంలో ఉండే నిరక్ష్యరాస్యులైన బాలికలను వివాహానికి ఒప్పిస్తున్నారు. ఇందుకుగాను గిరిజన యువతులను వెతికి పెట్టేందుకు మహబూబాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు/వ్యక్తులు పని చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి కొందరు పెళ్లికి సిద్ధపడుతుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నెక్కొండ సంఘటనే నిదర్శనం. పట్టపగలు పార్కులో ఈ తంతు జరగడంతో బాలిక వివాహానికి వ్యతిరేకించడం తేలికైంది. అదే తెలియని ప్రదేశంలో, అపరిచిత వ్యక్తుల సమక్షంలో జరిగితే ఆ బాలిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చేది. వీడని మిస్టరీ నెక్కొండ ఘటన నేపథ్యంలో గతంలో ఇక్కడ జరిగిన రెండు దుర్ఘటనలకు కారణం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాల పరిధిలో 2012, 2015 సంవత్సరాల్లో చోటుచేసుకున్న రెండు సంఘటనల్లో నలుగురు లంబాడా బాలికలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇప్పటీకీ ఆ మరణాలకు కారణం ఏమిటనేది పోలీసుల దర్యాప్తులో తేలలేదు. చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట దగ్గర బోడగుట్ట తండా వద్ద ఇద్దరు బాలికలు బానోతు ప్రియాం క, బానోతు భూమిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు మరణించి శవాలు కుళ్లిపోయిన దశలో ఓ బాలిక మృతదేహాం తాలూకు పుర్రెను కుక్కలు గ్రామంలోకి తీసుకురావడంతో ఈ సంఘటన వెలుగు చూసింది. చనిపోయిన ఈ బాలికలను 2015 డిసెంబరు 27న గుర్తించారు. ఇద్దరిదీ పర్వతగిరి మండలం రోళ్లకల్లు గ్రామ శివారు కంబాలకుంట తండా. వీరు నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకునే సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎవరు హత్య చేశారు.. బాలికలను అక్కడికి ఎవరు తీసుకెళ్లారు.. అక్కడం ఏం జరిగిందనే అంశంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. నెక్కొండ మండలం మరిపెల్లి శివారు వాజ్యానాయ క్ తండాకు చెందిన బానోత్ అనూష, జాటోతు వనిత వయస్సు 16 ఏళ్లు. పదో తరగతి చదివే ఈ ఇద్దరు గిరిజన బాలికలు 2012 నవంబరు 14న కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో శవమై కనిపించారు. ఇంటర్మీడియట్ చదవే సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు రెండు రోజుల తర్వాత రైల్వేట్రాక్ పక్కన శవాలుగా తేలారు. రైల్వే ట్రాక్ దగ్గరకు ఎందుకు వెళ్లారు.. ఎవరూ తీసుకెళ్లారు.. ఎటు ప్రయాణిస్తున్నారనే అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో ఈ కేసు చిక్కుముడి కూడా వీడిపోలేదు. -
కాంట్రాక్టు వివాహాల కలకలం
-
కాంట్రాక్టు వివాహాల కలకలం
నెక్కొండ(నర్సంపేట): అరబ్ షేక్‌ల తరహా మోసాలు వరంగల్‌లో వెలుగు చూశాయి. వయసుపై బడిన వారు బాలికలు, యువతులను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏజెంట్లను నియమించుకుని బాలికల తల్లిదండ్రులను ఒప్పిస్తున్నారు. లంబాడీ తండాలే కేంద్రాలుగా ఈ మోసాలు జరుగుతున్నాయి. ఈ తరహా మోసం వరంగల్ రూరల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. నెక్కొండ మండలం గొట్లకొండ తండాకు చెందిన ఇద్దరు బాలికలు, ఓ వివాహిత మొత్తం ముగ్గురిని ఇతర రాష్ట్రాలకు చెందిన యాభై ఏళ్లకు పైబడిన ముగ్గురు వ్యక్తులు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో ఓ బాలిక పెళ్లికి నిరాకరించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 17వ తేదీన.. ఉత్తరభారత దేశానికి చెందిన 50 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన ముగ్గురు వ్యక్తులు మహబూబాబాద్ చుట్టు పక్కల గిరిజన యువతులను పెళ్లాడేందుకు ప్రయత్నించారు. వీరికి నెక్కొండ మండలం గొట్లకొండ గ్రామపంచాయితీ నాలుగో వార్డు సభ్యుడు గుగులోతు బిచ్చాతో పరిచయం అయ్యింది. తమ గ్రామానికి చెందిన ముగ్గురు పెళ్లికి సిద్ధంగా ఉన్నారంటూ బిచ్చా తెలిపారు. ఇందులో ఇద్దరు బాలికలు, వివాహం అయి భర్తతో దూరంగా ఉంటూ విడాకులకు ప్రయత్నిస్తున మరో మహిళ ఉన్నట్లు బిచ్చా చెప్పడంతో వయసుపైడిన ఆ ముగ్గురు వ్యక్తులు పెళ్లిల్ల కోసం రాజస్తాన్ నుంచి మహబూబాబాద్‌కు వచ్చారు. ఇద్దరు బాలికలు, వివాహితతోపాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులు కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఓ పార్కుకు ఈనెల 17న చేరుకున్నారు. ఇందులో ఓ బాలిక పార్కులోకి వచ్చేందుకు నిరాకరించింది. దీంతో మిగిలిన ఇంకో బాలిక, వివాహితతో పెళ్లి తంతు జరిపించారు. ఆయా కుటుంబాల సంప్రదాయం ప్రకారం బాలిక, యువతిని కూర్చోబెట్టి వారి నుదుట పెళ్లి చేసుకునే వ్యక్తితో బొట్టు పెట్టించారు. ఈ తంతంగాన్ని వీడియో తీశారు. ఇష్టం లేక.. ఇనుగుర్తి పార్కులో పెళ్లి తంతులో భాగంగా బొట్టు పెట్టుడు కార్యక్రమం పూర్తయిన తర్వాత నవంబరు 18న నెక్కొండ మండలం గొట్లకొండకు బాలిక, వివాహిత చేరుకుంది. మరుసటి రోజు నుంచి పెళ్లి(బొట్టు పెట్టుడు) జరిగింది కాబట్టి తమ భార్యలను పంపిస్తే తీసుకెళ్తామంటూ రాజస్తాన్‌కు చెందిన వారు బిచ్చాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. అలాగే వెళ్లిపోయిన బాలికను పెళ్లికి ఒప్పించాలంటూ ఒత్తిడి చేశారు. పెళ్లిపై ఒత్తిడి తీవ్రం కావడంతో నవంబరు 23 గురువారం రాత్రి సదరు బాలిక విషయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో కూతురు ద్వారా నెక్కొండ పోలీసులకు గురువారం రాత్రి సమాచారం అందించారు. శుక్రవారం బిచ్చాపై కేసు నమోదు చేశారు. పెళ్లి తంతు నిర్వహిస్తున్న దృశ్యం ఒక్కో పెళ్లికి రూ.50వేలు ఇద్దరు బాలికలు, మరో వివాహితతో యాభైఏళ్లకు పైబడిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి జరిపించేందుకు నెక్కొండ నాలుగోవార్డు సభ్యుడు గుగులోతు బిచ్చా మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇందుకు ఒక్కో పెళ్లికి రూ.50 కమీషన్‌గా తీసుకునేందుకు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే లంబాడీ తండాలలో శిశువులను అమ్మకాలు జరుగుతున్న వైనం వివా దాస్పదం అవుతోంది. ఈ తరుణంలో అరబ్‌షేక్‌ల తరహాలో బాలికలను వయసు పైడిన వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తున్న అంశం బయటపడటం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి విషయంలో గ్రామస్తులు, బాలికల తలిదండ్రులకు సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. మహబూబాబాద్ అడ్డా.. మహబూబాబాద్ చుట్టు పక్కల ఉన్న మార్బుల్, గ్రానైట్ వ్యాపార లావాదేవీల కోసం రాజస్థాన్‌కు చెందిన వారు ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇందులో కొందరు ఇక్కడి గిరిజన యువతులను పెళ్లిలు చేసుకుంటున్నారు. వయసు పైడిన వ్యక్తులకు గిరిజన యువతులను వెతికి పెట్టేందుకు మహబూబాబాద్ కేంద్రంగా కొన్ని ముఠాలు/వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇందులో ఓ ముఠా సభ్యులతో బిచ్చాకు సంబంధాలు ఉన్నాయి. అలా ఈ పెళ్లి తంతు కార్యక్రమం జరిగింది. ఇప్పటికే మహబూబాబాద్ మండలం ఏటిగడ్డకు చెందిన ఓ ముఠా ఇదే తరహాలో ఐదు పెళ్లిల్లు జరిపించినట్లు సమాచారం. పరారీలో నిందితుడు బాధిత బాలిక కుటుంబం నుంచి ఫిర్యాదు తీసుకుని బిచ్చాపై కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బిచ్చా పరారీలో ఉన్నాడు. బాలికలను పెళ్లి చేసుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరనే అంశంపై విచారణ చేస్తున్నాం. త్వరలో వీరిని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తాం.– నవీన్, ఎస్సై, నెక్కొండ -
‘అమ్మాయిలను అమ్మేసే ముఠా అరెస్ట్’
-
‘అమ్మాయిలను అమ్మేసే ముఠా అరెస్ట్’
హైదరాబాద్: పేద ముస్లిం కుటుంబాలకు మాయ మాటలు చెప్పి మైనర్ బాలికలను అరబ్ షేక్‌లు దుబామ్ తరలిస్తున్నారని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కాంట్రాక్టు మ్యారేజీలు, మైనర్ బాలికలను దుబాయ్‌కు అమ్మేసే గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని వెల్లడించారు. 12 బ్రోకర్లు, 3 ఒమన్ షేక్‌లు, 2 ఖాజీలను పట్టుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఖాజీ అలీ అబ్దుల్లా రఫై ఓల్టా కూడా అరెస్టైన వారిలో ఉన్నాడని చెప్పారు. 38 మంది బ్రోకర్లను గుర్తించామని, అందులో 15 మంది ఒమన్‌కు చెందినవారని తెలిపారు. కేరళ, కర్ణాటక, ముంబై నుంచి వీసాలు తెప్పించి హైదరాబాద్ మైనర్ బాలికలను గల్ఫ్ దేశాలకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. పట్టుబడిన అరబ్ షేక్‌ల వద్ద అనేక రకాల స్టిరాయిడ్స్, లైంగిక సామర్థ్యాన్ని పెంచే మాత్రలు లభించాయన్నారు. ఒక్కో ఖాజీ 10 మంది మైనర్ బాలికలను పెళ్లి చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. ఒమన్ దేశానికి రాయాబార కార్యాలయం ద్వారా లేఖ రాసి ఇలాంటి వారిని మన దేశానికి రాకుండా చూస్తామన్నారు. పదే పదే ఇలాంటి నేరాలకు పాల్లడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టబడ్డ అబ్దుల్ రఫై ఖాజీ ఇప్పటివరకు 50 వివాహాలు చేశాడని, దుబాయ్‌లో చాలా వరకు అమ్మాయిలను సరఫరా చేసేది ఇతడేనని డీసీపీ తెలిపారు. -
పాతబస్తీలో అరబ్ షేక్‌లు అరెస్ట్
-
పాతబస్తీలో అరబ్ షేక్‌లు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : పాత బస్తీలో ముస్లిం బాలికలకు కాంట్రాక్టు వివాహాలు జరుపుతున్నారన్న ఆరోపణలపై 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయని తమకందిన సమాచారం మేరకు డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలోని పోలీసుల బృందం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ముగ్గురు ఖాజీలు, 8 మంది అరబ్‌షేక్‌లు, ఐదుగురు మధ్యవర్తులు, నలుగురు హోటల్ యజమానులను అరెస్టు చేసినట్లు వీరందరిని విచారిస్తున్నట్లు చెప్పారు.