హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో పోలీసులు అర్థారాత్రి నుంచి కార్డ్ ఆన్ సెర్చ్ కొనసాగుతోంది. ఈ తనిఖీల్లో భాగంగా పిల్లలను అక్రమంగా రవాణా చేసే బీహార్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముమ్ముర తనిఖీల్లో 700 మంది పోలీసులు పాల్గొన్నారు.
అందిన ప్రాథమిక సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన సౌత్ జోన్ పోలీసుల బృందం అక్కడి భవానీ నగర్లో 250మందికి పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తాం, అవసరమైతే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.
పిల్లలను అక్రమ రవాణా చేసే ముఠా అరెస్ట్
Published Sat, Jan 24 2015 7:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement
Advertisement