హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నారంటూ ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం బంజారాహిల్స్లోని కల్పా స్కూల్ వద్ద పెద్ద సంఖ్యలో పేరెంట్స్ పాల్గొని నినాదాలు చేశారు.
ప్రతి ఏడాది అధికంగా ఫీజులు పెంచుతున్నారని... గత మూడేళ్లలో 70 శాతానికి పైగా ఫీజులు పెంచారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. నగరంలోని ప్రైవేట్ స్కూల్స్లో విద్యార్థులను చదివించడం పెను భారంగా మారుతుందని... దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్కూల్ ఫీజుల పెంపుపై ఆందోళన
Published Sat, May 7 2016 11:28 AM | Last Updated on Sat, Sep 15 2018 5:39 PM
Advertisement