సాక్షి, విజయవాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో బావాబావమరదుల మధ్య జరిగిన వివాదంలో బావమరిదిని బావ హతమార్చిన ఘటన సత్యనారాయణపురంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నింధితుడిని డీసీపీ నవాబ్ జాన్ అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ కలహాలతోనే రైల్వే గేట్‌మ్యాన్ రాజును కత్తులతో విచక్షణా రహితంగా తన చెల్లెలు భర్త శేఖరే హత్య చేశాడు. తన భార్య పుట్టింటికి రావడవం లేదనే మనస్థాపంతో ఆమె కుటుంబ సభ్యులపై పగ పెంచుకున్న శేఖర్, పథకం ప్రకారమే తన బావని హతమార్చాడని వెల్లడించారు. హత్య జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించామని డీసీపీ తెలిపారు.
ఐదువేల కోసం హతమార్చాడు
పథకం ప్రకారమే బావని హత్య చేశాడు.!
Published Tue, Jul 17 2018 3:42 PM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment