విక్రాంత్ పాటిల్ (డీసీపీ–1), ఉదయభాస్కర్ (డీసీపీ–2), నయిం హష్మీ,రవీంద్రబాబు
కృష్ణ జిల్లా ఎస్పీగా రవీంద్రబాబు, ఈస్టు గోదావరి జిల్లా ఎస్పీగా హష్మీ గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్‌గా రాహుల్‌దేవ్ శర్మ రైల్వే ఎస్పీగా కోయ ప్రవీణ్, విశాఖ డీసీపీ–1గా విక్రాంత్ పాటిల్ డీసీపీ–2గా ఉదయభాస్కర్ బిల్లా
ద్వారకానగర్(విశాఖ దక్షిణ): రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ–1గా విధులు నిర్వహిస్తున్న ఎం.రవీంద్రబాబును కృష్ణా జిల్లా ఎస్పీగా, డీసీపీ–2 నయి హష్మీని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. అలాగే విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ–1గా చిత్తూరు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ను, డీసీపీ–2గా ఉదయ భాస్కర్ బిల్లాను నియమించారు. గతంలో విక్రాంత్ పాటిల్ విజయనగరం జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. అనంతరం చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్లారు.
ఎం.రవీంద్రబాబు
కడప జిల్లాకు చెందిన ఎం.రవీంద్రబాబు 2001 గ్రూప్–1 అధికారి. గురజాల, వరంగల్ రూరల్, గుంటూరు టౌన్‌లో డీఎస్పీగా పనిచేశారు. అలాగే ఓఎస్‌డీ విజయనగరం, హైదరాబాద్ టాస్క్‌ఫోర్సులో డీఎస్పీగా, తరువాత విజయవాడ డీఎస్పీగా, గ్రేహౌండ్స్ డీఎస్పీగా, కృష్ణా జిల్లాలో విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డీసీపీగా పనిచేశారు. 2018లో విశాఖ డీసీపీ–1గా బదిలీపై వచ్చారు. ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్తున్నారు.
నయిం హష్మీ
2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హష్మీ 2018 నవంబర్‌లో విశాఖ పోలీస్ కమిషనరేట్ డీసీపీ–2గా బదిలీపై వచ్చారు. గతంలో రెండేళ్లు రంపచోడవరంలో పనిచేశారు. పది నెలలు కడప ఏఎస్‌డీగా పనిచేశారు. కడప అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తూ విశాఖకు డీసీపీగా వచ్చారు. తనపై నమ్మకం ఉంచి ప్రభుత్వం బదిలీ చేసిందని, మరింత బాధ్యతగా విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని.. విశాఖ ప్రజలు చాలా మంచి వారని.. అభిమానిస్తారన్నారు.
విక్రాంత్ పాటిల్
2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్‌ది కర్ణాటక, దార్‌వాడ్. 2018లో విజయనగరం జిల్లా ఓఎస్‌డీగా పనిచేశారు. అక్కడ నుంచి చిత్తూరు జిల్లా ఎస్పీగా బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు డీసీపీ–1గా బదిలీపై వస్తున్నారు.
ఉదయ్ భాస్కర్
ఆంధ్రాకు చెందిన ఉదయభాస్కర్ జమ్ము కాశ్మీర్ క్యాడర్ (ఐపీఎస్) అధికారి. ప్రస్తుతం విశాఖ సీఐడీ ఎస్పీగా డిప్యూటేష¯Œన్‌లో పనిచేస్తున్నారు. ఈయన విశాఖ పోలీస్ కమిషనరేట్‌కు డీసీపీ–2గా బదిలీపై వస్తున్నారు. ఆయన భార్య ఆదాయ పన్నుల శాఖలో పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment