రెండు రోజులు టైం ఇవ్వండి: ప్రదీప్‌ | anchor pradeep requested two days permission to attend court | Sakshi
Sakshi News home page

రెండు రోజుల గడువు కోరిన ప్రదీప్‌

Jan 10 2018 12:02 PM | Updated on Oct 19 2018 7:52 PM

Drunk And Drive Case:Pradeep to Attend Court tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన బుల్లి తెర నటుడు ప్రదీప్ నేడు (బుధవారం) నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను షూటింగ్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉండలం వల్ల కోర్టుకు హాజరు కాలేక పోతున్నానని, మరో రెండు రోజులు గడువు ఇవ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ప్రదీప్‌ వినతిని పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్‌ పోలీసులు రెండు రోజుల అనంతరం విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. డిసెంబర్‌ 31వ తేదీ అర్ధరాత్రి జరిపిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ప్రదీప్‌ పరిమితి మించి మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ  పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్‌ అనలైజర్‌లో సుమారు 178 పాయింట్లు చూపించింది. దీంతో ప్రదీప్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అప్పటి నుంచి ప్రదీప్‌  అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో ప్రదీప్‌ కౌన్సిలింగ్‌కు వస్తాడా? రాడా? అన్నది తెలియక పోలీసులు సైతం అయోమయంలో పడ్డారు. అయితే తాను ఎక్కడికీ వెళ్లలేదని, షూటింగ్‌ ఉండటం వల్లనే హాజరు కాలేకపోయానని ప్రదీప్‌ తెలిపాడు. ఈ నెల 8వ తేదీన తన తం‍డ్రితో కలిసి గోషామహల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు హాజరయ్యాడు. కౌన్సిలింగ్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల కలిగే అనర్థాలు వివరించడంతోపాటు.. మరోసారి తాగి వాహనం నడుపవద్దంటూ ప్రదీప్‌కు పోలీసుల సూచనలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement