పాఠశాల నుంచి వస్తున్న అన్నయ్యతొ కలిసి ఆడుకోవడానికి ఎదురు చూస్తున్న చిన్నారి అన్నయ్య స్కూల్
పెదకాకాని(గుంటూరు): పాఠశాల నుంచి వస్తున్న అన్నయ్యతొ కలిసి ఆడుకోవడానికి ఎదురు చూస్తున్న చిన్నారి అన్నయ్య స్కూల్ బస్సు రాగానే పరిగెత్తుకె ళ్లి ప్రమాదవశాత్తు స్కూల్‌బస్సు కింద పడి మృతిచెందాడు. బస్సు కింద చిన్నారి ఉన్న విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో.. వెనక చక్రాల కింద ఆ చిన్నారి చిద్రమయ్యాడు. ఈ హృదయవికార సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్(6) స్థానిక బీవీఆర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు.
ఈ క్రమంలో రోజు స్కూల్ బస్సు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ రోజు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో ఉన్నా రెండేళ్ల చిన్నారి బబ్లూ అన్నయ్య కోసం పరిగె త్తుకుంటు బస్సు వద్దకు వచ్చాడు. ఆదే సమయంలో అన్నయ్య బస్సులో నుంచి స్కూల్ బ్యాగ్ బాస్కెట్‌తో దిగుతున్న క్రమంలో బబ్లూ స్కూల్ బస్సు కిందికి వెళ్లాడు. ఇది గుర్తించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో వెనక చక్రాల కిందపడిన చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు.