The bus driver
-
స్కూల్‌బస్సు కిందపడి చిన్నారి మృతి
పెదకాకాని(గుంటూరు): పాఠశాల నుంచి వస్తున్న అన్నయ్యతొ కలిసి ఆడుకోవడానికి ఎదురు చూస్తున్న చిన్నారి అన్నయ్య స్కూల్ బస్సు రాగానే పరిగెత్తుకె ళ్లి ప్రమాదవశాత్తు స్కూల్‌బస్సు కింద పడి మృతిచెందాడు. బస్సు కింద చిన్నారి ఉన్న విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడంతో.. వెనక చక్రాల కింద ఆ చిన్నారి చిద్రమయ్యాడు. ఈ హృదయవికార సంఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్(6) స్థానిక బీవీఆర్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజు స్కూల్ బస్సు ద్వారా రాకపోకలు సాగిస్తున్నాడు. ఈ రోజు పాఠశాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇంట్లో ఉన్నా రెండేళ్ల చిన్నారి బబ్లూ అన్నయ్య కోసం పరిగె త్తుకుంటు బస్సు వద్దకు వచ్చాడు. ఆదే సమయంలో అన్నయ్య బస్సులో నుంచి స్కూల్ బ్యాగ్ బాస్కెట్‌తో దిగుతున్న క్రమంలో బబ్లూ స్కూల్ బస్సు కిందికి వెళ్లాడు. ఇది గుర్తించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో వెనక చక్రాల కిందపడిన చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. -
వడదెబ్బతో ఇద్దరు మృతి
- తాండూరు బస్టాండ్‌లో ఘటన - మృతులిద్దరూ గుర్తుతెలియని వ్యక్తులే.. తాండూరు: వడదెబ్బతో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన ఆదివారం తాండూరు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తాండూరు బస్టాండ్‌లో బస్సులు పార్కింగ్ చేసే స్థలంలో గుర్తుతెలియని ఓ యువకుడు(30) ఆదివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో చేతిలో వాటర్ ప్యాకెట్ పట్టుకొని తిరుగుతున్నాడు. కళ్లు తిరుగుతున్నాయని ఓ బస్సు నీడకు చేరుకున్నాడు. బస్సు డ్రైవర్ అతడి వివరాలు అడుగగా కళ్లు తిరుగుతున్నాయని యువకుడు చెప్పాడు. కొద్దిసేపటికే యువకుడు కిందపడి కాళ్లుచేతులు కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. యువకుడి వద్ద కాచిగూడ నుంచి అప్జల్‌గంజ్ వరకు, మహాత్మగాంధీ బస్‌స్టేషన్ నుంచి తాండూరుకు ప్రయాణించిన బస్ టిక్కెట్లులభించాయి. నగరంలోని కాచిగూడ స్టేషన్ రోడ్‌లోని త్రివేణి హోటల్ రసీదు లభ్యమైంది. ఈ రసీదుపై రమేష్ అని పేరు ఉంది. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన మెజ్బాన్ క్యాటరింగ్ విజిటింగ్ కార్డు లభించింది. మరో ఘటనలో.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో పాస్‌ల జారీ చేసే కౌంటర్ సమీపంలోని ప్లాట్‌ఫాంపై ఓ గుర్తుతెలియని వ్యక్తి(50) మృతిచెంది ఉన్నాడు. ఇతడి వద్ద ఈనెల 1వ తేదీకి చెందిన కర్ణాటక రాష్ట్రం మిర్యాణం బస్ టిక్కెట్ లభించింది. మృతులకు సంబంధించిన వివరాలు లభించలేదని పోలీసులు తెలిపారు. వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసులను దర్యాప్తు చేస్తున్నారు. మండిపోతున్న ఎండలు.. పగటి ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఎండలు భగ్గుమంటున్నాయి. భానుడి భగభగతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం 40.2 డిగ్రీలు, శనివారం 40.8, ఆదివారం 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ తెలిపారు. -
14 మంది విద్యార్థులకు గాయాలు
అలంపురం(పెంటపాడు), న్యూస్‌లైన్ : అలంపురంవద్ద జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పెంటపాడు మండలం బి.కొండేపాడు, తణుకు మండలం దువ్వ తదితర గ్రామాలకు చెందిన ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థులను ఎక్కించుకుని శనివారం ఉదయం జాతీయరహదారి మీదుగా క ళాశాలకు బయలుదేరింది. అలంపురం ఆంజనేయస్వామి విగ్రహ సమీపంలోకి వచ్చేసరికి ముందువెళుతున్న ట్రాలీ లారీని ఓవర్ టేక్ చేయబోయి దానిని ఢీకొట్టింది. బస్సులోని క్లీనర్‌తోపాటు 14 మంది ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వారిని 108లో తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ స్వల్పగాయాలయ్యాయని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వేగంగా వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ట్రాలీని ఓవర్ టేక్ చేసి, దానిముందు వెళుతున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాద ం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పల్టీ కోట్టేదని, అయితే బస్సు డ్రైవర్ సమయోచితంగా బ్రేక్ వేయటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సీహెచ్ రమేష్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.