అలంపురం(పెంటపాడు), న్యూస్‌లైన్ : అలంపురంవద్ద జాతీయరహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కళాశాల బస్సులో ప్రయాణిస్తున్న 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బస్సు పెంటపాడు మండలం బి.కొండేపాడు, తణుకు మండలం దువ్వ తదితర గ్రామాలకు చెందిన ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థులను ఎక్కించుకుని శనివారం ఉదయం జాతీయరహదారి మీదుగా క ళాశాలకు బయలుదేరింది. అలంపురం ఆంజనేయస్వామి విగ్రహ సమీపంలోకి వచ్చేసరికి ముందువెళుతున్న ట్రాలీ లారీని ఓవర్ టేక్ చేయబోయి దానిని ఢీకొట్టింది. బస్సులోని క్లీనర్‌తోపాటు 14 మంది ఇంజినీరింగ్, ఫార్మశీ విద్యార్థుల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. వారిని 108లో తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వారందరికీ స్వల్పగాయాలయ్యాయని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వేగంగా వెళుతున్న బస్సు ముందు వెళుతున్న ట్రాలీని ఓవర్ టేక్ చేసి, దానిముందు వెళుతున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాద ం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు పల్టీ కోట్టేదని, అయితే బస్సు డ్రైవర్ సమయోచితంగా బ్రేక్ వేయటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సీహెచ్ రమేష్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
14 మంది విద్యార్థులకు గాయాలు
Published Sun, Mar 23 2014 12:44 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
Advertisement