సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి విద్యాకోర్సులు చదువుతున్న విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి బదిలీ అయ్యేందుకు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది. ఇందుకు ఇరు కాలేజీల నుంచి నిరభ్యంతర సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) తీసుకోవల్సి ఉంటుంది. ఎన్‌ఓసీ ఆధారంగా విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీకి బదిలీ కావచ్చు.