ప్రదీప్‌ పిల్లోడు.. పిల్లోడైతే పాలు తాగాలి! | comments on anchor pradeep issue in social media | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 1:47 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

comments on anchor pradeep issue in social media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి ప్రదీప్‌ ముందుకు రావడంలేదు. కారణం ఏమిటంటే.. నాకు షూటింగ్‌లు ఉన్నాయి.. అందుకే రావడం లేదు అని ఓ వీడియో మెసేజ్‌ పోస్టు చేశాడు. ఇంకా రెండురోజులు చూసి ప్రదీప్‌కు వ్యతిరేకంగా వారెంట్‌ జారీచేయాలని హైదరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు యాంకర్ ప్రదీప్ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చనే జరుగుతోంది. మద్యం తాగి వాహనాలు నడపవద్దంటూ ప్రజలకు హితవు పలికిన ప్రదీప్‌ ఆఖరికీ మద్యం తాగి వాహనం నడుపుతూ దొరికిపోయాడు. అతని బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో ఏకంగా 178 పాయింట్లు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ యాంకర్‌ ప్రదీప్‌పై అభిమానం చాటుకునేలా కామెంట్‌ పెట్టారు. "సార్ మా యాంకర్ ప్రదీప్ ని ఒగ్గేయండి. పాపం చిన్నపిల్లోడు. తెలియక చేసేశాడు" అంటూ ఫేస్‌బుక్‌లో హనీ భవానీ అనే నెటిజన్‌ కామెంట్ పెట్టారు. దీనికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తమదైన శైలిలో బదులిచ్చారు. "ఎవరినీ కించపరచడం లేదు.. చిన్నపిల్లోడు అయితే పాలు తాగాలి కాని మందు తాగి నడపడం కరెక్ట్ కాదు కదా? సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి.. అడ్మిన్ హెచ్" అంటూ ఆ అభిమాని కామెంట్‌కు దీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం  ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement