
అట్టుడికిన అగనంపూడి
జాతీయ రహదారి దిగ్బంధం
ప్రదీప్ ది ముమ్మాటికీ హత్యే
టీడీపీ నేతలే చేరుుంచారంటూ ఆరోపణ
నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు
అవంతి కళాశాల విద్యార్థి అనుమానాస్పద మృతి ఘటనపై జాతీయ రహదారితో సహా అగనంపూడి అట్టుడికిపోరుుంది. మృతుని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అగనంపూడి వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేయగా, కళాశాల విద్యార్థులు అనకాపల్లిలో నిరసనలతో హోరెత్తించారు. వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీగా తరలివచ్చి ధర్నాకు దిగడం.. అత్యుత్సాహంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నారుు.- అనకాపల్లి టౌన్/ అగనంపూడి
అగనంపూడి నిర్వాసితకాలనీ దానబోరుునపాలేనికి చెందిన దానబాల రాము కుమారుడు ప్రదీప్(20) మాకరపాలెంలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (నాలుగో సంవత్సరం) చదువుతున్నాడు. గత నెల 28న ప్రదీప్ తన స్నేహితుడు తులసికుమార్‌తో కలిసి కళాశాలకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కశింకోటకు చెందిన ఒక విద్యార్థినితో.. కశింకోటలో బస్సు దిగాడు. ప్రదీప్ కూడలిలో ఆమెతో మాట్లాడు తుండగా, కొంతమంది దుండగులు ప్రదీప్‌ను అందరూ చూస్తుండగానే చితక్కొడుతూ అక్కడ నుంచి అపహరించుకుపోయారు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి ప్రదీప్ తండ్రి రాము కశింకోట పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. కాగా 29న ఉమ్మలాడ వద్ద శారదానదిలో ప్రదీప్ శవమై తేలడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తమ కుమారుడిని కిడ్నాప్ చేసి హతమార్చారంటూ రాము తీవ్ర స్థారుులో ఆరోపించారు. కుటుంబ సభ్యులకు మద్దతుగా దానబోరుునపాలెం గ్రామస్తులు, మరో పక్క అవంతి కళాశాల విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. సోమవారం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేయగా, మంగళవారం తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు.
దద్దరిల్లిన హైవే..
తొలుత అవంతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామస్తులు అగనంపూడి కూడలి వద్దకు పెద్ద ఎత్తున చేరుకొని జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్య జరిగిందని, ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. వీరికి మాజీ ఎమ్మెల్యే చింతల పూడి వెంకట్రామయ్య, 56వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జి.పూర్ణానందశర్మ, గుర్రం శ్రీను, ఎల్.వి.రమణ, తెలుగుదేశం నాయకులు బలిరెడ్డి నాగేశ్వరరావు, సత్యనారాయణ, కూర్మాపు రవి తదితరులు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. వీరి ఆందోళన కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో గాజువాక, స్టీల్‌ప్లాంట్, దువ్వాడ, పరవాడ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పది మందిపై కేసు నమోదు చేశారు. విద్యార్థులు, గ్రామస్తులు అక్కడ నుంచి కారులు, బస్సులు, లారీల్లో అనకాపల్లికి తరలివెళ్లారు.
అనకాపల్లిలో భారీ ర్యాలీ..ధర్నా
అనకాపల్లి పట్టణంలో ర్యాలీ, ధర్నాలతో హోరెత్తించారు. అధికార పార్టీకి చెందిన నేతల అండతో కశింకోటకు చెందిన కొందరు యువకులు ప్రదీప్ చంపేసి నదిలోకి విసిరేశారని, తక్షణమే నిందితులను అరెస్టు చేయాం టూ నినదించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు వేలాదిగా తరలిరాగా వీరికి వైఎస్సార్‌సీపీ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా పాల్గొన్నారు. పట్టణంలోని రింగ్ రోడ్డు నుంచి పెద నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ వరకూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలి...ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న వారిపై సీఐ విద్యాసాగర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో విద్యార్థులు సీఐతో వాగ్వాదానికి దిగారు. ఆందోళనను విరమించాల్సిందిగా సీఐ ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ దశలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగారుు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించాయి. సీఐ విద్యాసాగర్ అత్యుత్సాహంతో విద్యార్థులపై చేరుుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. అనంతరం ఆందోళన కారు లు ఎన్టీఆర్ వైద్యాలయానికి చేరుకుని ఎదురుగా బైఠారుుంచి పెద్దపెట్టున నినాదాలు చేశా రు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వైఫల్యం కనిపిస్తుందంటూ నిరసన వ్యక్తం చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు
సీఎం డౌన్ డౌన్ ..ఎంపీ అవంతి శ్రీనివాసరావు డౌన్ డౌన్, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కశింకోట ఎస్‌ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. సాయంత్రం వరకు ఆస్పత్రి వద్ద నిరసన కొనసాగింది. చివరకు డీఎస్పీ పురుషోత్తం చేరుకొని పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. ఆందోళనను విరమించారు. దీనిని హత్య కేసుగా నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రదీప్ మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.
దానబోరుునపాలెంలో విషాదం
ఆడుతూ పాడుతూ తిరిగిన ప్రదీప్ హత్యకు గురవడంతో దానబోరుునపాలెం, దిబ్బపాలెం, అగనంపూడి నిర్వాసిత కాలనీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు మృతుడి ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. మృతుని ఇంటి వద్ద తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, అవంతి కళాశాల విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అమర్‌తో సహా స్థానిక నేతల మద్దతు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ స్థానిక నేతలు ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద ఆందోళన కారులకు మద్దతు పలికారు. తక్షణమే ఈ కేసు విషయంలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలనే నిందితులకు కొమ్ము కాస్తున్నారని అమర్‌నాథ్ ధ్వజమెత్తారు.
ఎన్నో మలుపులు..
కశింకోట: ఇంజనీరింగ్ విద్యార్థి దానపాల ప్రదీప్‌ను తీవ్రంగా కొట్టి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. గత నెల 28న కశింకోట వచ్చిన ప్రదీప్, పరిచయం ఉన్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థినితో కలిసి ఉండటాన్ని సహించలేక స్థానికులైన సారుు, సాకేత్, కిరణ్, తదితరులు తీవ్రంగా కొట్టి గాయపరచినట్లు సమాచారం. మొదట సంతబయల, డీపీఎన్ హైస్కూలు వెనుక, కోనేరు ప్రాంతాల్లో తీవ్రంగా కొట్టారు. అప్పటికే ప్రదీప్ నడవలేని స్థితిలో రక్తం కారుస్తూ ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దీనివల్లే ప్రదీప్ మతి చెంది ఉంటాడని, అనంతరం వాస్తవం మరుగుపరచడానికి ఆటోలో తీసుకెళ్లి నదిలో పడేసి ఉంటారని, ఇది హత్యే అరుు ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అరుుతే పోలీసుల దర్యాప్తులో ప్రదీప్‌ను కొట్టడం వాస్తవమేనని అంగీకరించిన నిందితులు ఆటోలో రూ.50 ఖర్చులకు ఇచ్చి సొంత ఊరు పంపామని పేర్కొన్నారు. దీంతో మొదట కిడ్నాప్ కేసుగా నమోదు చేసి తాజాగా తండ్రి రాము ఫిర్యాదుతో హత్య కేసుగా మార్పు చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో కశింకోట ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తం మవుతున్నారుు. ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా పోలీసు అధికారులు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హత్యకేసుగా నమోదు
కశింకోట: శారదా నదిలో శవమై లభించిన ఇంజనీరింగ్ విద్యార్థి దానపాల ప్రదీప్ అనుమానాస్పద మతిని పోలీసులు మంగళవారం హత్య కేసుగా నమోదు చేశారు. అనకాపల్లి ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ బి.మధుసూదనరావు మంగళవారం ఈ సంగతి తెలిపారు. మాకవరపాలెం వద్ద ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న అగనంపూడి ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ ఓ విద్యార్థినిని కలవడానికి వచ్చి కశింకోటలో గత నెల 28న కిడ్నాప్‌కు గురి కావడం, ఆ తర్వాత శారదానదిలో అనుమానాన్పద స్థితిలో శవమై లభ్యం కావడం తెలిసిందే. మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేసి, తండ్రి రాము ఫిర్యాదుతో తాజాగా హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. తన కుమారుని హత్యకు ప్రధానంగా కశింకోటకు చెందిన టీ డీపీ నాయకుడు బుదిరెడ్డి చిన్నతోపాటు కిరణ్, సారుు, సాకేత్,ప్రసన్న, తదితరులు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రదీప్ శవానికి ఇంక్వెస్టు నిర్వహించామన్నారు. బాధితుల డిమాండ్ మేరకు విశాఖ కెజిహెచ్‌లో బుధవారం శవానికి పోస్టుమార్టం జరగనుందన్నారు. దీంతో కేసులో వాస్తవాలు వెల్లడి కాగలవన్నారు. కేసు దర్యాప్తులో ఉందన్నారు.
నిందితుడికి టీడీపీ నేత అండ!
అనకాపల్లి: ఇంజినీరింగ్ విద్యార్థి ప్రదీప్‌పై దాడికి వ్యూహరచన చేసి అతని మృతికి కారణమైన యువకునికి కశింకోటకు చెందిన ఒక కీలక టీడీపీ నేత కొమ్ము కాస్తున్నారన్న విషయంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నారుు. అందుకే పోలీసులు కూడా ఉదాశీన వైఖరిని ప్రదర్శించారు. టీడీపీ నేత తనకున్న పలుకు బడితో కేసును నీరుగార్చేందుకు ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడనే కోణంలోనే దర్యాప్తు జరిగేలా తప్పుదారి పట్టించారు. ఈ క్రమంలోనే పోలీసులు కూడా మొదట్లో సీరియస్‌గా ఈ కేసును తీసుకోలేదు. అధికారపార్టీ నేతల ఒత్తిడి పోలీసులపై ఉండడంతోనే ప్రదీప్‌కు సంబంధించిన కేసు పక్కతోవ పట్టేలా కుటిల పన్నాగాలు పన్నారని అర్ధమవుతోంది. దీనికిగానూ ప్రదీప్‌ను 28వతేదీ రాత్రి ఆటోలో పంపించామని కొట్టినవారు చెబుతున్నారు. అలాంటపుడు ఆటోలో వెళ్తున్న ప్రదీప్ 31వతేదీ నాటికి శారదానదిలో ఎలా శవమై తేలాడో వారికే తెలియాలి. పోనీ ఆటోల్లోంచి ప్రదీప్ గెంతి వేస్తే డ్రైవర్ తప్పకుండా పోలీసులకు సమాచారాన్ని ఇచ్చేవాడు. రెండు రోజుల ఆందోళనలు తీవ్ర దుమారాన్ని రేపడంతో అనకాపల్లిలో నిర్వ హించాలని భావించిన పోస్టుమార్టంను కేజీహెచ్‌కు తరలించారు.