170 మందిపై క్రిమినల్ కేసులు | 170 criminal cases | Sakshi
Sakshi News home page

170 మందిపై క్రిమినల్ కేసులు

Published Mon, Oct 5 2015 1:52 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

170 criminal cases

న్యూఢిల్లీ: ఈ నెల 12న జరిగే బిహార్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 583 మంది అభ్యర్థుల్లో 130 మంది తీవ్రస్థాయి క్రిమినల్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ దశలోని అభ్యర్థుల్లో  170 మందిపై క్రిమినల్ కేసులుండగా, వారిలో 130 మందిపై నాన్ బెయిలబుల్ కేసులున్నాయని, అందులో 16 మంది హత్యారోపణలు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ తెలిపింది. అభ్యర్థులిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. వార్సాలిగంజ్ జేడీయూ అభ్యర్థి ప్రదీప్‌పై హత్యకు సంబంధించిన 4 కేసులున్నాయి.

తొలిదశ అభ్యర్థుల్లో  146 మంది  కోటీశ్వరులు. కాగా, పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల తయారీలో ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకోవాలని, మేనిఫెస్టో విడుదల తర్వాత తమకొక కాపీ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement