
ఈ షో రూటే సెపరేటు!
ప్రదీప్ షో చేశాడంటే అది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఎనర్జీని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిక్సీలో వేసి తిప్పితే ప్రదీప్ అయ్యిందేమో అనిపిస్తుంది అతణ్ని చూస్తే. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ షో సూపర్ సక్సెస్ అయ్యిందంటే అది కేవలం అతడి వల్లే. అదే విధంగా ఇప్పుడు ‘బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్’ని కూడా విజయపథంలో నడిపిస్తున్నాడు ప్రదీప్. దేశం నలు మూలలా ఉన్న వైవిధ్యభరిత టాలెంట్స్‌ని పరిచయం చేసే వేదిక ఈ బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్. వాళ్లను గెస్టులుగా వచ్చిన సెలెబ్రిటీలు చాలెంజ్ చేస్తారు.
ఆ చాలెంజ్‌ను వాళ్లు ఎలా స్వీకరించారు, తమ టాలెంట్‌తో ఎలా బదులు చెప్పారు అన్నదే షో. అన్ని రకాల టాలెంట్స్‌నీ చూడటం ఓ గొప్ప అనుభూతి. కాన్సెప్ట్‌లో వెరైటీ ఉంటే ఏ కార్యక్రమానికి అయినా ప్రేక్షకులు పట్టం కడతారు. అచ్చంగా అలాంటి షోనే ఇది. రొటీన్ డ్యాన్‌స, కామెడీ షోల మధ్య ఓ సెపరేట్ రూట్‌ని సృష్టించుకుంది. కాన్సెప్ట్ క్రియేట్ చేసినవాళ్లను మెచ్చుకోవాల్సిందే!