శివరాత్రి సందర్భంగా స్నానమాచరించడానికి గోదవరి నదిలో దిగిన ఇద్దరు యువకులు నదిలో పడి గల్లంతయ్యారు.
శివరాత్రి సందర్భంగా స్నానమాచరించడానికి గోదవరి నదిలో దిగిన ఇద్దరు యువకులు నదిలో పడి గల్లంతయ్యారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా మణుగూరు మండలం మల్లెపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన ప్రదీప్, నాగరాజు అనే ఇద్దరు యువకులు శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానం ఆచరించడానికి గోదావరి నదిలో దిగారు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లే సరికి ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఇది గుర్తించిన పోలీసులు వారి ఆచూకి కోసం గాలిస్తున్నారు.