దక్షిణగంగ గా పిలుచుకునే గోదావరి పరవళ్లు తొక్కుతోంది.
- 37 అడుగులకు చేరుకున్న గోదావరి
భద్రాచలం : దక్షిణగంగ గా పిలుచుకునే గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వదర వచ్చి చేరడంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరుకుంది. దీంతో పుష్కర స్నాన ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి.