
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ టీవీ యాంకర్ మాచిరాజు ప్రదీప్ (35) పరారీలో ఉన్నట్లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బేగంపేట, గోషామహల్‌లో ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్లకు తల్లి లేదా భార్యతో కౌన్సెలింగ్‌కు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన మంగళవారం కౌన్సెలింగ్‌కు హాజరు కాలేదు. దీంతో నోటీసులు అందించేందుకు పోలీసులు బుధవారం మణికొండలోని ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది.
కూకట్‌పల్లిలోని కార్యాలయానికి వెళ్లిన పోలీసులకు అక్కడ కూడా చుక్కెదురైంది. ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో ఆయన పరారీలో ఉన్నట్లు పోలీసులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. గురువారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే శాంతిభద్రతల విభాగం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment