
బాగానే టాచ్ చేస్తున్నాడు
ప్రదీప్ అంటేనే ఎనర్జీ. గుక్క తిప్పుకోకుండా మాట్లాడటం, మాట్లాడినంతసేపూ చిరునవ్వులు చిందిస్తూనే ఉండటం అతడి ప్రత్యేకతలు. అందుకే అతడి షో ఎంతసేపు చూసినా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా’ చూసినా సేమ్ ఫీలింగ్!
ప్రతి చానెల్‌లోనూ నిరంతరం ఇంటర్వ్యూలు ప్రసారమవుతూనే ఉంటాయి. అయితే ప్రదీప్ ఇంటర్వ్యూలు మాత్రం డిఫరెంట్.
కాస్త సరదాగా, ఇంకాస్త చిలిపిగా ఆయన ప్రశ్నలు సంధించే తీరు షోను చూసే ప్రేక్షకులనే కాదు, షోలో పాల్గొనే సెలెబ్రిటీలను కూడా ఆకట్టుకుంటుంది. నొప్పింపక, తానొవ్వక అన్నట్టుగా ఉండే మాటకారితనానికి... టచ్‌లో ఉంటే చెప్తానంటూ తారల జీవితాల్లోని పలు కోణాలను సున్నితంగా టచ్ చేస్తోన్న వైనానికి ప్రదీప్‌కి ఫుల్ మార్కులు వేయవచ్చు!