
ఓ రోజు ఇంట్లో లేకపోతే..?
ఓ వ్యక్తి ఓ రోజు ఇంట్లో లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఆ తరువాత పరిణామాలు ఏంటి? అనే విభిన్నమైన కథాంశంతో వస్తున్న చిత్రం ‘జగన్నాటకం’. ప్రదీప్, ఖెనీషా జంటగా చిత్రసౌధం పతాకంపై ప్రదీప్ నందన్ దర్శకత్వంలో ఆదిశేషరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రెండో వారంలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఖెనీషా మాట్లాడుతూ ‘‘కష్టపడి ఈ చిత్రానికి వర్క్ చేశాం. అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రమిది’’ అన్నారు. చిత్రానికి ఎడిటింగ్: చంద్రశేఖర్, కెమెరా: సతీష్ ముత్యాల.