
సాక్షి, హైదరాబాద్: ఎడాపెడా వెబ్‌సైట్ల ఏర్పాటు.. రేటింగ్ కోసం అశ్లీల లింకులు.. సెలబ్రిటీల ఫొటోల మార్ఫింగ్.. ఇలా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ రూ. లక్షలు సంపాదిస్తున్న వెబ్‌సైట్ల నిర్వాహకులపై సీఐడీ దృష్టి సారించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ సైబర్ క్రైమ్ అధికారులు మూడు అశ్లీల వెబ్‌సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్ ను అరెస్ట్ చేశారు. ఇతడి విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి.
ప్రదీప్ ఒక వెబ్ సైట్‌లో పెట్టిన అశ్లీల పోస్టును తనకే చెందిన మరో రెండు వెబ్‌సైట్లలోనూ వేరే లింకుతో పోస్టు చేసేవాడు. ఇలా ఈ మూడు సైట్లకూ రేటింగ్ వచ్చేది. దీంతో ప్రతీ వారం గూగుల్ నుంచి ప్రదీప్ అకౌంట్‌కు ఒక్కో వెబ్‌సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున రూ.15 వేలు వచ్చినట్టు సీఐడీ గుర్తించింది.
ప్రకటనలతో రూ. 40 వేలు..
అశ్లీల లింక్స్‌తో వారానికి రూ.15 వేలు సంపా దించిన ప్రదీప్‌కు.. గూగుల్ నుంచి తన సైట్లలో ప్రకటనల ద్వారా నెలకు రూ.40 వేలు సంపా దించినట్టు విచారణలో బయటపెట్టాడని అధి కారులు తెలిపారు. ఇలా మూడేళ్లుగా సెలబ్రిటీ లపై అశ్లీల పోస్టులు పెట్టి ప్రదీప్ రూ.20 లక్షల కుపైగా సొమ్ము చేసుకున్నట్టు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment