
ప్రదీప్ హత్యకేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు
కశింకోట : ఇంజినీరింగ్ విద్యార్థి దానబాల ప్రదీప్ హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి, విచారణకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు డీఎస్పీ పురుషోత్తం గురువారం రాత్రి తెలిపారు. గత నెల 28న ప్రదీప్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు నిందితుల్లో బుదిరెడ్డి చిన్న పరారీలో ఉన్నాడని చెప్పారు. అలాగే మరో నిందితుడు ఆర్మీ ఉద్యోగి కిరణ్‌ను ఆర్మీ నుంచి రప్పించడానికి లేఖ పంపుతున్నామని తెలిపారు.
వీరితోపాటు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రదీప్‌కు పోస్టుమార్టం నివేదిక రావడానికి మరో మూడు రోజులు పడుతుందని చెప్పారు. ఆ నివేదికను కోర్టుకు సమర్పించి, అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈలోగా కేసు దర్యాప్తు యథావిధిగా జరుగుతుందన్నారు.