
తియ్యని అనుభూతి!
చంద్రుళ్లో ఉండే కుందేలు.. కిందకొచ్చిందా? కిందకొచ్చి నీలా మారిందా? అంటూ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో త్రిష కోసం సిద్ధార్ధ్ పాడిన పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడీ పాటను గుర్తు చేయడానికి కారణం.. ‘చుంద్రుళ్లో ఉండే కుందేలు’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. క్రాంతి చంద్, అవితేజ్, ప్రదీప్, అర్జున్ ముఖ్యతారలుగా శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ పతాకంపై వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ను కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ- ‘‘కళలు మానవ జీవితంలో భాగం.
కళలు లేకుంటే మానవ జీవితం విస్తారమవుతుంది. చలన చిత్ర రంగం విజ్ఞానాన్ని, వినోదాన్ని, సందేశాన్ని అందిస్తున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘తియ్యని అనుభూతికి గురి చేసే చిత్ర ఇది. మంచి సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అని దర్శక- నిర్మాతలు తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, దర్శకుడు సముద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: విశ్వనాథ్.