యెర్వాడ జైలులో ఓ ఖైదీ ఆదివారం సాయంత్రం తనకు తానుగా ఓ పదునైన ఆయుధంతో తీవ్రంగా గాయపర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పింప్రి, న్యూస్‌లైన్: యెర్వాడ జైలులో ఓ ఖైదీ ఆదివారం సాయంత్రం తనకు తానుగా ఓ పదునైన ఆయుధంతో తీవ్రంగా గాయపర్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ జైలులో ఖైదీ ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండవసారి. ఈ సంఘటన విషయమై జైలు అధికారులు అందజేసిన వివరాల ప్రకారం.. జాంబూర్‌వాడిలోని అంబేగావ్‌కు చెందిన ప్రహ్లాద్ వామన్ వీర్ జూలైలో కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్యను హత్య చేసి శిక్ష అనుభవిస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం జైలులో ప్రత్యక్షంగా చాలా మంది ఖైదీలు చూస్తుండగానే తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో పొడుచుకున్నాడు. ఇది గమనించిన జైలు సిబ్బంది అతడిని వెంటనే జైలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇదిలా ఉండగా యెర్వాడ జైలులో ఏడాది క్రితం శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన సిద్ధిక్‌ను శరత్ మోహలే అనే ఖైదీ హత్య చేయగా, నాలుగు నెలల క్రితం ఒక ఖైదీ టవల్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.