పోలీసుపై దౌర్జన్యం కేసులో వ్యక్తికి జైలు
Published Tue, Oct 4 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
కొవ్వూరు : పోలీస్ కానిస్టేబుల్‌పై తిరగబడి దౌర్జన్యం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో మల్లివెల్లి అమ్మిరాజు అనే వ్యక్తికి సెకండ్ అడిషనల్ అండ్ జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వై.శ్రీలక్ష్మి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పుచెప్పారు. ఈ విషయాన్ని ఎస్సై ఎస్.ఎస్.ఎస్. పవన్‌కుమార్ తెలిపారు. గత ఏడాది మే 21న విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ఎ.ఏడుకొండలుపై పట్టణానికి చెందిన అమ్మిరాజు తిరగబడ్డారని, దీంతో కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement