స్కూల్ గుమాస్తాకు నాలుగేళ్ల జైలు
Published Thu, Oct 27 2016 1:28 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM
తణుకు : ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజు మొత్తాన్ని సొంతానికి వాడుకున్న గుమాస్తాకు రెండు కేసుల్లో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ తణుకు రెండో అదనపు జుడీషియల్ మొదటి తరగతి మెజిస్ట్రేట్ ఇ.రాజేంద్రబాబు బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజినింగ్ అధికారి ఆర్.బెన్నిరాజు కథనం ప్రకారం.. తణుకు పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూలులో పని చేస్తున్న ఖండవల్లి విక్టర్‌బాబు 2012లో విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజు మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించలేదు. దీనిపై పాఠశాల కరస్పాండెంట్ అరకుల మోహనరావు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఏఎస్సై జి.ప్రభువరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా వాదోపవాదాల అనంతరం రెండుకేసుల్లో రెండేళ్లచొప్పున జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో ఆరునెలల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.
Advertisement