అనుమానంతో భార్యను చంపిన భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది.
భార్యను హత్య చేసిన భర్తకు జీవితఖైదు
Jan 28 2017 12:40 AM | Updated on Jul 30 2018 8:29 PM
ఏలూరు(సెంట్రల్) : అనుమానంతో భార్యను చంపిన భర్తకు జీవితఖైదు విధిస్తూ న్యాయస్థానం శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. పెదపాడు మండలం కలపర్రు గ్రామానికి చెందిన కడిమి రమేష్‌కి ఏడేళ్ల క్రితం స్వాతితో వివాహమైంది. అప్పటి నుంచి అనుమానంతో రమేష్ స్వాతిని వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 2012 జనవరి 1న ఆమె పీక కోసి అతి దారుణంగా చంపేశాడు. దీనిపై స్వాతి బంధువులు ఫిర్యాదు మేరకు పెదపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానంలో నేరం రుజువు కావడంతో రమేష్‌కు జీవితఖైదు, రూ.6 వేలు జరిమానా విధిస్తూ ఫ్యామీలీ కోర్టు న్యాయమూర్తి సి.రమాదేవి తీర్పు చెప్పారు.
Advertisement
Advertisement