బాలికను మోసగించిన కేసులో వ్యక్తికి ఏడేళ్ల జైలు
Published Thu, Jan 19 2017 1:40 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM
కొయ్యలగూడెం : బాలికను నమ్మించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి ఏడేళ్ల కారాగార శిక్షను న్యాయమూర్తి విధించారు. ఎస్సై ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ కథనం ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఏలేటి దిలీప్‌కుమార్ లైంగికదాడి చేశాడు. ఈ మేరకు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో వాదోపవాదాల అనంతరం నిందితుడిపై నేరం రజువు కావడంతో జూనియర్ సివిల్ జడ్జి బి.సత్యానందం అతనికి ఏడేళ్ల కారాగార శిక్ష విధించారు.
Advertisement
Advertisement