
కామాంధుడికి 1,535 ఏళ్ల జైలు శిక్ష
ఐదేళ్ల కాలంలో 29 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన అల్బర్ట్ మొరాకె(35) అనే వ్యక్తికి జొహన్నెస్‌బర్గ్ హైకోర్టు గురువారం 1,535 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
జొహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా): ఐదేళ్ల కాలంలో 29 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన అల్బర్ట్ మొరాకె(35) అనే వ్యక్తికి జొహన్నెస్‌బర్గ్ హైకోర్టు గురువారం 1,535 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మొరాకెపై నమోదైన 175 కేసులపై (అందులో 30 రేప్, 41 కిడ్నాప్, 24 దోపిడీ సహా పలు హత్య, కిడ్నాప్ కేసులు ఉన్నాయి) విచారణ చేపట్టిన కోర్టు ఒక్కో అత్యాచారానికి జీవిత ఖైదు, దోపిడీలన్నింటికీ కలిపి 360 ఏళ్లు, ఇతర కేసుల్లో విధించిన వందల సంవత్సరాల జైలు శిక్షలన్నింటినీ కలిపి 1,535 ఏళ్ల కారాగారవాసాన్ని ఖరారు చేసింది. కాగా, గాటెంగ్ ప్రావిన్స్‌లోని టెంబిసా ప్రాంతంలో 2007-12 మధ్య అల్బర్ట్ ఈ ఆకృత్యాలకు పాల్పడ్డాడు.